Monday, December 23, 2024

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించింది బిఆర్‌ఎస్ పార్టే

- Advertisement -
- Advertisement -
  • టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం: తెలంగాణలో రైతులకు 8 గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో కెసిఆర్ సర్కార్ పెద్ద అవినీతికి పాల్పడిందని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మన తెలంగాణతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ ఉచిత విద్యుత్ కోసం పోరాటం చేస్తుంటే కెసిఆర్, చంద్రబాబు పక్కన ఉన్నాడని గుర్తు చేశారు.

ఖమ్మం సభలో తెలంగాణలో ఉచిత విద్యుత్‌కు కట్టుబడి ఉన్నామని అన్నారు. కావాలనే కాంగ్రెస్ పార్టీ ఎదుగుతున్న తీరును ఓర్వలేక బిఆర్‌ఎస్ నేతలు రేవంత్‌రెడ్డి తానాలో మాట్లాడిన తీరుపై వక్రీకరించిందని ఏద్ద్దేవా చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై రేవంత్‌రెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందేనని అన్నారు. రైతులకు తప్పుదోవ పట్టించడానికే కెటిఆర్ ఇలాంటి చీఫ్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News