Friday, January 24, 2025

మహారాష్ట్రలో పార్టీ బలోపేతంపై దృష్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహారాష్ట్రలో పార్టీ బలోపేతంపై భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) అధిష్టానం దృష్టి సారించింది. టిఆర్‌ఎస్ పార్టీ బిఆర్‌ఎస్‌గా మారినప్పటి నుంచే మహారాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచే దేశం మొత్తానికి విస్తరించడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. మహారాష్ట్ర నుంచే బిఆర్‌ఎస్ దేశ రాజకీయాల్లో ప్రవేశించాలని.. అందుకు నాగపూరే సరైన వేదిక అని తొలి నాళ్లలో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చెప్పేవారు. ఈ క్రమంలోనే ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్‌లో పార్టీ తొలి కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా గంగాపూర్‌లోని సావ్‌ఖేడ్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బిఆర్‌ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News