Monday, January 20, 2025

కార్యకర్తలకు, నాయకులకు బిఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండ

- Advertisement -
- Advertisement -

తుర్కయంజాల్‌ః కార్యకర్తలకు, నాయకులకు బిఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని రంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వెల్లడించారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోహెడ గ్రామానికి చేందిన మొర్రి బాల్‌రాజు బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చేందడంతో అయన సతీమని మంజూలకు పార్టీ నుండి మంజూరైన ప్రమాద భీమా చేక్కు రూ,,2 లక్షలను శుక్రవారం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలకు బిఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ పార్టీ ఆధ్యక్షుడు వేముల అమరేందర్‌రెడ్డి, 4వ వార్డు కౌన్సిలర్ సిద్దాల జ్యోతి, అబ్దుల్లాపూర్‌మెట్ మండల రైతు బందు కోఆర్డినేటర్ కందాళ బలదేవారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బిందు రంగారెడ్డి, ప్లోర్ లీడర్ కళ్యాణ్‌నాయక్, పులగుర్రం విజయానంద్‌రెడ్డి, ధన్‌రాజ్, బుడ్డ బాబు, గంగని శ్రీనివాస్, పసుల దేవేందర్, శీలం మానయ్య, యార కుమార్, శీలం ప్రవీణ్, కంటి శోభ, సునిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News