Friday, December 20, 2024

కొనసాగుతున్న ‘మహా’ చేరికలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతూనే ఉన్నది. సిఎం కెసిఆర్ నాయక త్వం, తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులైన మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నాయకులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు బిఆర్‌ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరారు. చేరిన ‘మ హా’ నేతలకు సిఎం కెసిఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. విదర్భ ప్రాంతం నుం చి కాంగ్రెస్, బిజెపికి చెందిన పలువురు నాయకులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

వారిలో వార్ధా, నాగ్‌పూర్ జిల్లాల్లోని ఆర్వి, రాంటెక్ తదితర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఉన్నారు. చేరినవారిలో వార్ధా జిల్లా అర్వి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వరాజ్ షెట్కారీ సంఘటన్ మహారాష్ట్ర అధ్యక్షుడు జై కుమార్ శంకర్ రావు బల్కెడే, బిజెపి వార్ధా జిల్లా యువమోర్చా నేత, ఒబిసి నాయకురాలు హర్షతాల్ జైకుమార్ బల్కెడే, యాదవరావ్ కేశవరావ్ బంగే, రాజ్ బౌవ్ షెట్కాడె, నిరంజన్ పాటిల్, రామచంద్ర బరంగె, సచిన పండరీ, దర్పణ్ టోక్సె, భోజరాజ్ కౌషి, రోషన్ కర్కూరె, గోపాల్ గిరాడే, మయూర్ థాక్రె, ఆశిష్ ఘండే, నౌషాద్ సౌదగర్, మం గళా అద్వికార్, మణేష్, ప్రశాంత్, యోగేష్, ఆశిష్, అక్షయ్ బోనె, అదేవిధంగా నాగ్ పూర్ జిల్లా రాంటెక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాంటెక్ మున్సిపల్ కౌన్సిల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రమేష్ కార్మోరె (ఎమ్మెల్యే పోటీదారుగా పోటీ చేసిన అభ్యర్థి), మాజీ కార్పొరేటర్ ఉమేష్ మహాజన్, శేలేష్ పాఠక్, ప్రయాస్ టవాలె, నాందేడ్ జిల్లా కిన్వత్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సురేష్ రంగినేని (ఎమ్మెల్యేగా పోటీచేసిన అభ్యర్థి), అదేవిధంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దేవ్ రావ్ గోన్వే, గిరిజన నాయకుడు నారాయణ రావు సిడెం, ఇంగోలి నియోజకవర్గం నుంచి సందీప్ వినిక్కతే, కిన్వత్ ని యోజకవర్గం గోత్ సర్పంచ్ రాజారామ్ కోవె, దేవిదాస్ మునేశ్వర్ తదితరులు ఉన్నారు.

ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో…

శుక్రవారం నాడు బిఆర్‌ఎస్ పార్టీలో పలువురు మరాఠా నేతలు చేరారు. బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, కొల్లాపూర్ లోక్ సభ మాజీ జిల్లా కో ఆర్డినేటర్ యువరాజ్ ఆనంద్ రావు పాటిల్, చాంగడ్ టౌన్ కౌన్సిలర్, కొల్లాపూర్ మాజీ జెడ్‌పి సభ్యులు ఆనంద్ బాలా సాహెబ్ హలందకర్, మాజీ ఎంఎల్‌ఎ శంకర్ కౌలకర్ కుమారుడు, విద్యావేత్త సుశీల్ కౌలకర్, బిజెపి కాగల్ తాలూకా అధ్యక్షుడు సందీప్ కురులే, కర్వీర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణ తనేకర్, మహారాష్ట్ర రోజ్ ఘర్ పరిషత్ అధ్యక్షులు, కౌలాపూర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ విక్రమ్ జరాగ్, కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ జిల్లా అధ్యక్షురాలు అంజలి జాదవ్, అధికార ప్రతినిధి రవీంద్ర కైరే, తుల్జాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన ఎస్‌టి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రశాంత్ నవగిరె, మార్కెట్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అశోక్ రావు పాటిల్, ఉస్మానాబాద్ జెడ్పీ సభ్యులు ప్రకాష్ చౌహాన్, శివసేన పార్టీ తుల్జాపూర్ తాలూకా అధ్యక్షుడు కృష్ణ మోరే, వంచిట్ బహుజన ఆఘడి జిల్లా ఉపాధ్యక్షులు అంకుష్ లోకాణ్డే.

పూణే జిల్లా నుంచి భీమా కారేగన్ – సిధానక్ మహార్ 12వ రాజవంశీకుడు మలింద్ ఇందమూర్, హ్యూమన్ రైట్స్ ఎగైనెస్ట్ కరప్షన్ సంస్థ అధ్యక్షుడు ఫిరోజ్ ఉమర్ కచ్చి షేక్, సామాజిక కార్యకర్త నంజీన్ శనాద్ సయ్యద్, గ్రామీణ వశహరి పర్యావరన్ సేవ భావి సంస్థ అధ్యక్షుడు విజయ్ విఠల్ రావు సూర్యవంశీ, వెస్ట్ మహారాష్ట్ర, ఖేడ్ తాలూకా (సతారా) షెట్కారి సంఘటన అధ్యక్షులు శంకర్ రావు దుల్తారోయ్ గాడ్సే, సతారా తాలూకాకు చెందిన బాబా సాహెబ్ రాజారామ్ జాధవ్, కోరేగావ్ తాలూకా నుంచి సురేష్ రామచంద్ర షిండే, పఠాన్ తాలూకా నుంచి శివాజీ విష్ణు కోలేకర్, మగలసేదా తాలూకా నుంచి సిద్ రాం భానుదాస్ మెంబడే, వాయి తాలూకా నుంచి రంగారావు శంకర్ రావు ఫద్రారె, అఘడి షెట్కారి సంఘటన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సంధ్య థాయ్ వసంత్ రావు ఇంగోలి, యావత్ మాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు నానాసాహెబ్ గడిబొలి, సతారా లోక్ సభ నుంచి డాక్టర్ శంబాజి శివాజీ సంక్పాల్, వాయి ఖండల్ అసెంబ్లీ నుంచి కిషోర్ జాధవ్, ప్రకాష్ పవసే, కోరే గావ్ అసెంబ్లీ నుంచి శివాజీ షిండే, చంద్రకాంత్ నాందేవ్ జాధవ్, శివాజీ హిందు రావు షిండే, ఎన్‌సిపి మహారాష్ట్ర ఉపాధ్యక్షుడు, 2019 ఎమ్మెల్యే గా పోటీచేసిన ఘన్ శ్యాం అన్నా షేలర్, యువ నాయకుడు ప్రశాంత్ షేలర్ తదితరులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరినవారిలో ఉన్నారు. ఈ చేరికల సందర్భంగా మహారాష్ట్ర సీనియర్ నేతలు మాణిక్ కదం, శంకరన్న డోన్గే తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News