Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ పార్టీ రైతుల టీమ్

- Advertisement -
- Advertisement -

అన్నదాతల అభివృద్ధి కోసం తెలంగాణ సర్కారు తపన. రైతు పంటలకు సాగు నీళ్లు అందించేందుకు కాలంతో పోటీపడి పూర్తవుతున్న ప్రాజెక్టులు! ఒక్క పక్క కాళేశ్వరం పొలాలకు నీళ్లు తోడుకునేందుకు నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా! సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు! తాజాగా.. అన్నదాతలు సాగుకు సిద్ధమయ్యేందుకు రైతుబంధు పేరిట వ్యవసాయ సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం పంపిణీ! దానితో పాటే రికార్డుల ప్రక్షాళనతో రైతు పట్టాలన్నింటికీ పక్కాగా లెక్క తేల్చి ఇచ్చిన కొత్త పాస్ బుక్కులు! రైతును రాజును చేసే దిశగా అహరహం శ్రమిస్తున్నది తెలంగాణ సర్కారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా దేశం అభివృద్ధి చెందకపోవడానికి ఏళ్లుగా దేశాన్ని పాలించిన ప్రభుత్వాల చేతగానితనానికి నిదర్శనం. దేశంలో పుష్కలంగా నీరున్నా కేంద్ర ప్రభుత్వం చేతగానితనం వల్ల సాగు, తాగు నీరు ఇవ్వలేకపోతున్నాయి. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కావడం లేదు? అన్ని వనరులూ ఉన్న మన దేశం ఇంకెంతో అభివృద్ధి చెందాలి, కానీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల దేశం అభివృద్ధికి నోచుకోలేకపోతున్నది. దేశం ఒక లక్ష్యం లేకుండానే ముందుకు సాగుతుంది? ఏ లక్ష్యం లేకుండా నిర్లక్ష్యంగా పాలన ఎలా వుందో మనం కొన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాం. దేశానికి కెసిఆర్ లాంటి నాయకుడు స్వయం గా రైతు, రైతు కష్టాలు తెలిసిన నాయకుడు. అందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా కొత్త తరహా రైతు పథకాలు ప్రవేశపెట్టి రైతుల ఆదాయం పెంచే దిశగా అడుగులు వేస్తున్నరు.ఈ గుణాత్మక మార్పులతో రైతులకు భరోసా ఇస్తు న్నది కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. దేశ ప్రజలు కూడా కెసిఆర్ పాలనా కావాలని కోరుకుంటున్నారు, ఇతర రాష్ట్రాల్లో కెసిఆర్ పర్యటనలు చేస్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దేశంలోని అన్ని సమస్యలకు పరివర్తన భారతే సరైన సమాధానమని, అందుకే బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించింది.దేశంలో వనరులు పుష్కలంగా ఉన్నా విద్యుత్ సమస్య ఎందుకు ఉంది? థర్మల్ విద్యుత్ తయారీకి పుష్కలంగా బొగ్గు నిల్వలు ఉన్నాయి. కానీ తెలంగాణ తరహా అభివృద్ధి ఇతర రాష్టంలో ఎందుకు లేదు? పదేళ్లలోనే తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందో మనం ఎదుట ఆవిష్కరణతో సంక్షేమ దిశగా అవతరించింది.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయాయి. అభివృద్ధి విషయంలో ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలి. దేశాన్ని దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్ పాలించింది. దేశ ప్రజలు కాంగ్రెస్, బిజెపిలకు అవకాశం ఇచ్చారు. బిఆర్‌ఎస్ పార్టీ కేవలం రైతు ఎజెండాతో అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకెళ్తుతుంది.దేశం సరికొత్త పంథాలో నడవాల్సిన అవసరం’ ఎంతోగానో ఉంది. భవిష్యత్తరాలకు మన దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శం కావాలి, దానికి కెసిఆర్ పాలనా నాయకత్వం ముమ్మాటికీ అవసరం ఉంది. నకిలీ విత్తనాలను నమ్మి మోసపోవడం.. చేతికి పంట రాక.. పెట్టుబడికి చేసిన అప్పు కట్టలేక.. కుటుంబాలు సమస్యగా మారిన రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో, దేశంలో ఆత్మహత్యే శరణ్యమైంది. కొద్దో గొప్పో చేతికి వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక విలవిలలాడిన రైతు కండ్లల్లో ఇప్పుడు తెలంగాణ వచ్చిన తరువాత మార్పు చూస్తున్నాం. ఓ వైపు సాగు నీళ్లు, మరో వైపు నిరంతర విద్యుత్. ఒకప్పుడు జీవితంపై ఆశ వదులుకున్న రైతు, నేడు గుండె నిండా ధైర్యంతో వ్యవసాయం చేసుకుంటున్నరు. రైతుల మంచి కోసం ఏదైనా చేయవచ్చు అనే సంకల్పాన్ని కెసిఆర్ నిరూపించారు. తెలంగాణలో వ్యవసాయానికి పెద్ద పీట వేసింది. కోటి ఎకరాలకు పైగా సాగు నీరిచ్చింది. ఇప్పుడు దేశ ప్రజలు కూడా ఇలాంటి సంక్షేమ పాలనా కోరుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ అభివృద్ధికి ప్రభు త్వం అహర్నిశలు కృషి చేస్తున్నది. నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను 24 గంటల పాటు వ్యవసాయానికి అందిస్తున్నది. బీడుబారిన భూమికి ప్రభుత్వం కల్పించిన సాగు నీటి వసతితో సస్యశ్యామలంగా మారింది. వ్యవసాయ రంగంపై ఆధారపడి బతికే రైతుకు ఆర్థిక వెసులుబాటు కోసం పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందజేస్తున్నది. అనేక నూతన వ్యవసాయ పద్ధతులు, విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి వ్యవసాయంలో అధిక దిగుబడికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతును రాజును చేసే దిశగా శ్రమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పరిపూర్ణం చేసేందుకు.. రాష్ట్రాన్ని రైతు సంక్షేమ రాజ్యంగా మార్చేందుకు పునాదులేస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేపట్టని ఈ వినూత్న నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం అయింది. ఈ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమన్వయ సమితుల సహకారంతో, అవగాహనతో వ్యవసాయ దండగా కాదు, వ్యవసాయ పండగగా జరుగుతుంది! తెలంగాణ ప్రభుత్వ సారథిగా అభివృద్ధి, సంక్షేమంపై ఉన్న అవగాహనతో సమగ్ర ప్రణాళిక రూపొందించి దశల వారీగా ఒక్కొక్క సమస్యను పరిష్కరించడానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే రైతులు, వ్యవసాయ రంగం సమస్యలపై దృష్టి సారించారు. దేశానికి వెన్నెముక అయిన రైతన్నకు అండగా నిలువాలని ముందుగానే వ్యూహాన్ని రూపొందించారు.

వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దాలని తలపెట్టారు. బొగ్గు విద్యుత్తు, సోలార్ పవర్, హైడ్రో పవర్‌కు మాత్రం దేశంలో ఎటువంటి సమస్య లేదు. ఆ బొగ్గు రిజర్వులు బిలియన్ టన్నుల్లో ఉంది. కావాల్సినంత బొగ్గు నిల్వలు వున్నప్పుడు.. విద్యుత్తు సమస్య ఎందుకు వస్తుంది? హైడ్రో, సోలార్, బొగ్గును సమతుల్యం చేస్తే, అప్పుడు దేశ వ్యాప్తంగా విద్యుత్తు సమస్య ఉండదు. ఇప్పుడు రైతుల కోసం 24 గంటల పాటు ఉచిత విద్యుత్తును తెలంగాణ అందిస్తోంది.
అప్పులు కట్టలేక ఉరితాడుకు వేలాడిన రైతు ఇప్పుడు ధైర్యం గా హలం పట్టి ముందుకు కదులుతున్నడు. రైతుకు దగ్గర కావాలన్న తపనతో ప్రభుత్వం రైతుల్లో నూతన ఒరవడిని కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతుబంధు వంటి పథకాలను ప్రశంసించడం గమనార్హం. పైగా వారు రుణ మాఫీని వద్దంటూనే, వ్యవసాయ సంక్షోభ నివారణకు ఏ సూచనలు చేస్తున్నారో, వాటిని ప్రభుత్వం అనుసరిస్తుండటం కూడా గమనించవలసిన విషయం. రైతు సమగ్ర వ్యవసాయ వ్యూహంలో భాగంగా చూసిన వారికి దాని ప్రాధాన్యం అర్థమవుతుంది. వ్యవసాయ రంగంలో తాను సూచించే పరిష్కారాలకు తెలంగాణ నమూనా ఉపయుక్తంగా ఉంటుంది. ఆర్థికవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిధిలోనే ఆలోచిస్తారు. కానీ పరిపాలకులు మొత్తం సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని పరిష్కారాలు అన్వేషిస్తారు. కెసిఆర్ వ్యవసాయ రంగ వ్యూహం ఈ విధంగా రూపొందినదే. దేశంలో కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్టంలో కనీసం పంటకు పెట్టుబడి లేక, నీటి వసతి లేక, కరెంటు లేక, గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బందిపడుతున్నరు. 75 ఏళ్ళ స్వాతంత్య్ర దేశంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వ్యవసాయ రంగ సంస్కరణలు అమలు జరుగడం లేదు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం అందడం లేదు. వీటన్నిటి పరిష్కారం కోసం కెసిఆర్ తెలంగాణను నమూనాగా నిలబట్టేందుకు దేశ ప్రజల సంక్షేమ కోసం బిఆర్‌ఎస్ పార్టీతో ముందుకు పోతుండు. రైతులకు అవసరమైన నీటి వసతి, విద్యుత్, పెట్టుబడి, యంత్రాలు, గిడ్డంగులు, మార్కెట్ సౌకర్యం, పంటకు మద్దతు ధర మొదలైనవి మనం దేశంలో వనరులు ఉన్న రైతులకు వివరిస్తున్నారు.
తెలంగాణలో రైతు సంస్కరణలు, రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ద్వారా పంట వేయడం మొదలుకొని మార్కెటింగ్ వరకు పకడ్బందీ వ్యవస్థ నిర్మాణం సాగుతున్నది. వ్యవసాయ క్షేత్రంలో మంచి చెడులను చర్చించుకొని, అధికారుల సలహాలతో ముందుకు కదిలేందుకు రైతు వేదికలను ఏర్పాటు చేసి ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తర ణాధికారిని నియమించారు. ప్రతి 5 వేల ఎకరాలకు రైతు వేదిక ఏర్పాటు చేశారు. ఒక్కో వేదిక కోసం రూ. 12 లక్షలతో భవనాన్ని నిర్మించడమే కాకుండా నూతన టెక్నాలజీని రైతులకు ఎప్పటికప్పుడు అందించడానికి కంప్యూటర్లు, ఆన్‌లైన్ సిస్టమ్‌లు ఏర్పాటు చేశారు. మట్టి నమూనాలను పరీక్షించేందుకు ఆధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. మట్టిలో సారాన్ని పరీక్షించి రైతుకు అవగాహన కల్పించడమే కాకుండా అందులో డిఎపి, యూరియా ఎంతవరకు వాడాలి, నీరు ఎంత పెట్టాలి, ఆ మట్టిలో ఏ పంట వేయాలని రైతులకు సూచనలు ఇచ్చే కేంద్రంగా మలుస్తు న్నారు.

ఏ వస్తువు కొనాలన్నా ఉత్పత్తిదారుడికే వస్తువు ధర నిర్ణయించే హక్కు తెలంగాలలో ఉంది. ధరను నిర్ణయించే హక్కును రైతులకు ఇవ్వాలన్నదే కెసిఆర్ సంకల్పం. అవసరమైన చోట శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యవసాయ పనిముట్లు కూడా అందించి పంట కాలనీలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. రైతన్న ఏ పంట వేసుకున్నా ఆ పంటకు డిమాండ్ తగ్గకుండా చేయాలని కెసిఆర్ సంక ల్పించారు. భవిష్యత్‌లో గిట్టుబాటు ధర గోస రైతులకు ఉండకూడదనే వినూత్నమైన పద్ధతిలో పంట కాలనీలు ఏర్పాటుచేసి గ్రామాల వారీగా వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ధరలను నియంత్రించడం కోసం పంట కాలనీలు ప్రవేశపెట్టాలన్నదే కేసీఆర్ ఆలోచన. నకిలీ విత్తనాలు, ఎరువులు ఎవరైన వ్యాపారస్థులు విక్రయిస్తే 6 నెలల జైలు శిక్ష వేసి కఠినంగా శిక్షలు విధించడం తెలంగాణకే సాధ్యం. ఈ దేశానికి అన్నం పెట్టే రైతు దేవుడితో సమానం. కష్టపడి పంటను పండించి మనకు అన్నం పెట్టి రైతు కాలం చేస్తే వారి కుటుంబం అనాథ అయితది. ఆ కుటుంబాలను ఆదుకుంటే కొంతైన బాధ తీర్చగలమని కెసిఆర్ చేసిన ఆలోచనే రైతు బీమా. రైతు దూరమైతే వారం రోజుల్లో ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమాను అందేలా చర్యలు తీసుకున్నారు. రైతులను సంపన్నులను చేసి అంతిమంగా అప్పులు లేని దశకు తీసుకపోవడమే ముఖ్యమంత్రి కెసిఆర్ అంతిమ లక్ష్యం. వ్యవసాయం ఒక పండుగ కావాలని ఆయన ఆశయం. రైతే రాజు కావాలనేది ఆయన ఆకాంక్ష. ఒక రైతే పాలకుడిగా అధికారం చేపడితే రైతు సంక్షేమం కోసం ఏమైతే చేయగలరో అదంతా సిఎం కెసిఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ప్రజల, పాలకుల మన్ననలు పొందింది. రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. అందుకే బిఆర్‌ఎస్ పార్టీ రైతుల టీమ్, ప్రజల టీమ్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News