Sunday, December 22, 2024

బిజెపిపై పోరాటం చేసేది బిఆర్‌ఎస్ పార్టీయే

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : దేశ ప్రజల సంక్షేమం, రైతు అభివృద్ది కోసం బిజేపి పై పోరాటం చేసేది బిఆర్‌ఎస్ పార్టీ ఒక్కటే అని డిసిసిబి చైర్మన్, బిఆర్‌ఎస్ నాయకులు గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మద్య బిఆర్‌ఎస్ బిజేపికి బి టీం అంటూ దుష్పచారం చేస్తున్న వాక్యాలను ఆయన తీవ్రంగ ఖండించారు. దేశంలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై, తెలంగాణ పంటను కొనుగోలుపై బిజెపి బిఆర్‌ఎస్ పోరటం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు ఒక్క మాటకూడ రైతులకు మద్దగా మాట్లాడలేదని అన్నారు.

బిజెపి పార్టీ నేడు చేలరేగా టానికి కాంగ్రెస్ పార్టీ చాతగాని తనమే కారణమని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న చంద్రాబాబు నాయుడు సలమాతో ముందకు పోతున్న తెలుగు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి బిజెపికి మద్దతుగా ఉంటడాని అన్నారు. ఎన్నికల తరువాత అవసరమైతే తన వర్గ ఎమ్మెల్యేలతో బిజేపి కి తెలుగు కాంగ్రెస్ నాయకుడు మద్దతు ఇస్తాడని అన్నారు. బిజేపి పాలనకు వ్యతి రేఖంగా రైతు రాజ్యం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వన బిఆర్‌ఎస్ ముందకు పోతుందని కాంగ్రెస్ నాయకులు దష్ఫుచారం ఖండిస్తూన్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News