Sunday, December 22, 2024

బిఆర్‌ఎస్ పార్టీతోనే ప్రజలకు మేలు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:బిఆర్‌ఎస్‌తోనే ప్రజలకు మేలు జ రుగుతుందని.. గులాబి జెండా తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని స్థానిక శాసనసభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన యువకులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన యువకులకు గులాబి కండువాలనుకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద్భంగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ యువకులకు అ ండగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉంటుందన్నారు.

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. బిఆర్‌ఎస్‌పార్టీలో రూ.100 చెల్లించి క్రీ యాశీలక సభ్యత్వం పొంది మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి రూ.2లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఇతర పార్టీల నుంచి బిఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

బిఆర్‌ఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కో రారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బిఆర్‌ఎస్ పార్టీ గెలుపు ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు టివిఎన్‌రెడ్డి, యాదవచారి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News