Monday, December 23, 2024

మళ్లీ గెలిచేది బిఆర్‌ఎస్ పార్టీనే…హ్యాట్రిక్ సిఎం కెసిఆరే !

- Advertisement -
- Advertisement -

తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి
రాష్ట్ర సమ్మిళిత, సమీకృత, సామరస్య అభివృద్ధి దేశానికి రోల్ మోడల్
ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సిఎం కెసిఆర్ మళ్లీ హ్యాట్రిక్ సిఎంగా పదవిని అధిరోహిస్తారని, మళ్లీ తెలంగాణలో గెలిచేది బిఆర్‌ఎస్ పార్టీయేనని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ వేదికగా చెప్పారు. దేశం మొత్తం అల్లకల్లోలమవుతున్న వేళ తెలంగాణలో ముస్లింలంతా చాలా భద్రంగా ఉన్నారని, తెలంగాణలో పుట్టిన ముస్లింగా తామంతా గర్విస్తున్నామని గుండెమీద చేయివేసుకొని ఆయన చెప్పారు. తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, రాష్ట్ర సమ్మిళిత, సమీకృత, సామరస్య అభివృద్ధి దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. శాసనసభలో ఆదివారం ‘రాష్ట్ర ఏర్పాటు -స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతి’పై జరిగిన లఘుచర్చ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.

జైపూర్ రైలు ఘటనలో చనిపోయిన హైదరాబాద్ యువకుడికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్య దేశానికి గొప్ప సందేశం పంపిందని ఆయన చెప్పారు. దీనికిగాను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌కు అక్భరుద్దీన్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని అక్బరుద్దీన్ తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి ఘర్షణలకు తావులేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు అందిస్తుందన్నారు. మిషన్ భగీరథ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందిస్తోందన్నారు. తెలంగాణ రెండంకెల అభివృద్ధి సాధిస్తుందని ఆయన వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, షాదీముబారక్, గురుకులాలు ప్రతి పథకం అద్భుత ప్రతిఫలాలు ఇస్తుందన్నారు. రాష్ట్రంలో సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని అన్ని రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఉండటం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో 50 లక్షల మంది మైనార్టీలు ఉన్నారని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2200 కోట్లు కేటాయించిందన్నారు. మైనార్టీలకు షాదీ ముబారక్, ఓవర్సీస్ స్కాలర్‌షిప్ వంటి పథకాలను ప్రభుత్వం చేపట్టిందని ఆయన వెల్లడించారు. రెండో హజ్ హౌస్‌కు ప్రభుత్వం రూ.23 కోట్లు కేటాయించిందని ఆయన చెప్పారు. 58, 59 జీఓ కింద పట్టాలు ఇచ్చి ప్రభుత్వం పేదలను ఆదుకుంటుందని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News