Friday, November 22, 2024

ఉద్యమ సమయం, రాష్ట్ర సాధనలో ఎన్నారైల పాత్ర క్రియాశీలకం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం
అన్ని రంగాల్లో తెలంగాణ మొదటి స్థానంలో
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
లండన్‌లో ఘనంగా బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను లండన్ నగరంలోని హౌంస్లౌ ప్రాంతంలో ఎన్నారై బిఆర్‌ఎస్ యూకే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, విశిష్ట అతిథిగా ఎఫ్‌డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు. ముందుగా జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి, అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Also Read: 70 ఏళ్లలో తొలి యూకె రాజుగా మూడో చార్లెస్ పట్టాభిషేకం

అనంతరం పార్టీ జెండా ఎగరేసి ‘దేశ్ కి నేత కెసిఆర్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధనకోసం ఎన్నారైలంతా క్రియాశీలకంగా పనిచేశారని ఆయన గుర్తు చేశారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ఎన్నారై ఆడబిడ్డలు బతుకమ్మను, బోనాలను సైతం మరువకుండా తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారని ఆయన అభినందించారు. సాధించుకున్న రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలో మొదటి స్థానంలో ఉందని, తెలంగాణ మోడల్ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు.

Also Read: భారత్‌లో విమానయాన సంస్థలు ఎందుకు దెబ్బతింటున్నాయి?

రాబోయే ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తుంది: అనిల్ కూర్మాచలం
ఎఫ్‌డిసి చైర్మన్, ఎన్నారై బిఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలో బిఆర్‌ఎస్ జెండా దేశ నలుమూలల ఎగరాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రాబోయే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి ఎన్‌ఆర్‌ఐలు బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. రాబోయే ఎన్నికల్లో వంద సీట్లు గెలిచి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కెసిఆర్ చరిత్రలో నిలవడం ఖాయమని అనిల్ తెలిపారు. ఎన్నారై బిఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ బిఆర్‌ఎస్ దేశవ్యాప్తం ఎదగడానికి ఎన్‌ఆర్‌ఐలు ప్రముఖ పాత్ర పోషిస్తారని ఆయన వెల్లడించారు.

Also Read: గుర్రపు స్వారీ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్!

ఈ వేడుకల్లో ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వయిజరీ బోర్డు ఉపాధ్యక్షుడు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, ముఖ్యనాయకులు సత్యమూర్తి చిలుముల, హరి గౌడ్ నవాపేట్, మల్లారెడ్డి, సేరు సంజయ్, సతీష్ రెడ్డి బండ, నవీన్ భువనగిరి, రవి ప్రదీప్ పులుసు, సురేష్ బుడగం, సత్యపాల్ పింగళి, రమేశ్ ఎసెంపల్లి, మాదిరెడ్డి నవీన్ రెడ్డి, ప్రశాంత్, సురేష్ గోపతి, ప్రశాంత్ మామిడాల, మధు యాదవ్ మరియు ప్రవాస సంఘాల నాయకులు గణేష్ కుప్పం, రంజిత్, స్వాతి బుడగం, జాహ్నవి, సుప్రజ, క్రాంతి, శ్రావ్య, విద్య, స్నేహ, పావని, మాధవ్, దీపాక్షర, రవి కిరణ్, వంశీ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News