Thursday, January 23, 2025

‘మహా’జోష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహారాష్ట్ర నుంచి బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం తె లంగాణలో అన్ని వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ మోడల్‌గా దేశవ్యాప్తంగా ప్రజాధరణ పొందుతున్నవి.ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో పాటు, రైతు సంఘాల నే తలు, ముస్లిం మైనారిటీ వర్గాల నేతలు కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజారంజక పాలనపట్ల ఆకర్షితులవుతున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు మోడల్ మాదిరిగా తెలంగాణ మైనారిటీ అభివృద్ధి మోడల్ మహరాష్ట్ర సహా దేశవ్యాప్తంగా అమలు చేయాలని బలం గా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాటి మహారాష్ట్ర రైతు సంఘాల నేతల చేరిక జాతీయస్థాయిలో ప్రాధాన్యత సంతరించుకోగా, దీని కొనసాగింపుగా ఆదివారం నా డు మహారాష్ట్ర ముస్లిం మైనారిటీ నేత సయ్య ద్ అబ్దుల్ ఖదీర్ మౌలానా సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

అధినే త సిఎం కెసిఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సయ్యద్ అ బ్దుల్ ఖదీర్ మౌలానా.. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నేత. ఎన్‌సిపి పార్టీ ఉపాధ్యక్షులు. ఆయన మహారాష్ట్రలోని ఔరంగబాద్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి 2019లో ఎన్‌సిపి నుంచి ఎంఎల్‌ఎఅభ్యర్థిగా పోటీ చేశారు. గతంలో ఎన్‌సిపి జాతీయ మహారాష్ట్ర ఎన్‌సిపి రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారు. సయ్యద్ అబ్దుల్ ఖదీర్ మౌలానా ఎన్‌సిపి మహారాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కూడా. ఆయన మహారాష్ట్రకు చెందిన ప్రముఖ ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన కావడంతో వీరి చేరిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనకు ఔరంగాబాద్ జిల్లా ప్రాంతాల్లో రాజకీయంగా మంచి పట్టు ఉంది.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి, మహారాష్ట్రకు చెందిన బిఆర్‌ఎస్ పార్టీ నేతలు, రైతు నాయకుడు మాజీ ఎంఎల్‌ఎ శంకర్ అన్నా ధోంగే, వైజాపూర్ విధానసభ నియోజకవర్గ నాయకుడు అభయ్ పాటిల్, చిక్కగాంకర్ సాహెబ్, దళిత యువజన నాయకుడు ఏవీన్ష్ వస్మత్, ప్రహ్లాద్ రాఖోండే సాహెబ్, గోరఖ్ పాటిల్, శ్యామ్ కదమ్, గోవింద్ ధెంబారే, దేవానంద్ పాటిల్, తుకారాం సాల్వే, చంద్రవిలాస్ తొంబరే పాటిల్, గజానన్ కదమ్,సంతోష్ పాటిల్,యువనేత ప్రవీణ్ జెతెవాడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News