Saturday, December 21, 2024

ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం

- Advertisement -
- Advertisement -

BRS Party Office In Delhi

హైదరాబాద్: ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సర్దార్ పటేల్ రోడ్ లో భారత్ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. జోధ్ పూర్ రాజ వంశీయుల బంగ్లా లీజుకు తీసుకుని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. నూతన పార్టీ కార్యాలయాన్ని ఎంపి సంతోష్ కుమార్ ఎంపిక చేసినట్లు సమాచారం. భార‌త్ రాష్ట్ర స‌మితి పార్టీ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో వసంత్ విహార్ లో తెలంగాణ భవన్ పనులు వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఆరు నెలల్లో టిఆర్ఎస్ భవన్ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోనున్నారు. 2021 సెప్టెంబర్ 2న సిఎం కెసిఆర్ టిఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ముచ్చట తెలిసిందే. 1,200 చదరపు మీటర్ల విస్తరణంలో భ‌వ‌న నిర్మాణ ప‌నులు జరుగుతున్నాయి. తెరాస భవన్ నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News