హైదరాబాద్ : దేశంలో గు ణాత్మక మార్పు కోసం నడుంకట్టిన రాష్ట్ర ము ఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధ్యక్షులు కె. చంద్రశేఖర్‌రావు బుధవారం ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించా రు. సరిగ్గా మధ్యాహ్నం 12.37 గంటలకు ప్రారంభించారు. అనంతరం పార్టీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం కా ర్యాలయం మొదటి అంతస్తులో ఏర్పాటు చే సిన తన ఛాంబర్‌లో కెసిఆర్ ఆసీనులయ్యా రు. ఈ కార్యక్రమానికి జాతీయ రాష్ట్ర నాయకులు హాజరై కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యుపీ మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్, జెడిఎస్ అధినేత, కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చి రుతైగల్ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం, పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకులతో పాటు బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు పాల్గొన్నా రు.
పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కంటే ముందు రాజశ్యామల యాగం పూర్ణాహుతికి సిఎం కెసిఆర్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.
ఢిల్లీలో బిఆర్‌ఎస్ జోష్
బిఆర్‌ఎస్ పార్టీ నూతన జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీలోని సర్దార్‌పటేల్ రోడ్డు జై కెసిఆర్, జై భారత్, జై బిఆర్‌ఎస్ నినాదాలతో హోరెత్తింది. బిఆర్‌ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, కటౌట్లతో మొత్తం గులాబిమయమైంది. పలు రాష్ట్రాల నుండి వచ్చిన అతిథులు, పలు పార్టీలకు చెందిన నాయకులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొన్నది. బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు పార్టీ అధినేత, సిఎం కెసిఆర్‌మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు ఫణిశశాంక శర్మ, గోపీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో చేపట్టిన రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో సిఎం కెసిఆర్, ఆయన సతీమణి శోభారాణి దంపతులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు గుర్నాం సింగ్, ఇతర రైతుసంఘాల నాయకులు, మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు కె. కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కె.ఆర్. సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, పసునూరి దయాకర్ రావు, మాలోత్ కవిత, మన్నె శ్రీనివాసులు రెడ్డి, నామా నాగేశ్వర్ రావు, పి, రాములు, వెంకటేష్ నేత, ఎంఎల్‌సి కవితతో పాటు ఇతర శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పోరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
మహారాష్ట్రలో సంబురాలు
బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కెసిఆర్ ప్రారంభించగానే మహరాష్ట్ర వాసులు సంబురాలు చేసుకున్నారు.
నాందేడ్ జిల్లా కిన్వట్ తాలుకా పాటోథా గ్రామస్థులు బిఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతూ సిఎం కెసిఆర్ చిత్రపటంతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు.తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కెసిఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ‘ఆప్ కీ బార్ కిసాన్ కి సర్కార్’ అనే నినాదంతో కెసిఆర్ ప్రధాని అవుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
పొంగల్‌కు ఎపిలో ఎంట్రీ?
తెలంగాణ ఉద్యమ పార్టీ టిఆర్‌ఎస్ జాతీయ పార్టీగా మారింది. బిఆర్‌ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. దేశ వ్యాప్తంగా క్రమంగా వివిధ రాష్ట్రాల్లోకి విస్తరించాలనే యోచనలో పార్టీ అధినేత కెసిఆర్ ఉన్నారు. ఇందులో భాగంగా పక్కరాష్ట్రమైన ఎపిలో సంక్రాంతికి అడుగుపెట్టాలని యోచిస్తున్నారు. ఆంధ్రులకు సంక్రాంతి అతి పెద్ద పండగు కావడంతో పొంగల్ పండుగ (సంక్రాంతి) సంబురాల్లో ఎపిలో భారీ బహిరంగ సభతో పాటు పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఈ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అప్పగించినట్టు సమాచారం. ఎపిలోమూలాలు ఉండి హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖులతో కెసిఆర్ ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. జాతీయ పార్టీ అధికారిక గుర్తింపు కోసం తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో తొలుత పోటీ చేయాలనే యోచనలో ఆయన ఉన్నారు. తొలి దశలో ఎపి, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో పోటీ చేయాలని భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
దేశ రాజకీయాలపై చర్చ
బిఆర్‌ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి హాజరైన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, జెడిఎస్ నేత కుమారస్వామిలు కెసిఆర్‌తో సమావేశమయ్యారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందే కెసిఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు. సు మారు గంటకుపైగా కెసిఆర్‌తో వారు చర్చించారు. దేశంలో బిజెపిని నిలువరించేందుకు అవలంభించాల్సిన వ్యూహంపై సమాలోచనలు చేశారు.