Monday, December 23, 2024

ఎపి లోనూ బిఆర్‌ఎస్ ఆఫీస్ !!

- Advertisement -
- Advertisement -

విజయవాడ సమీపంలో 800 గజాల్లో పార్టీ కార్యాలయం !!
ఈ నెల 18,19న స్థల పరిశీలనకు మంత్రి తలసాని
ఓకే అనుకుంటే.. సిఎం కెసిఆర్ చేతనే శంకుస్థాపన ??

హైదరాబాద్ : టిఆర్‌ఎస్ పార్టీ అలా బిఆర్‌ఎస్‌గా మారగానే ఇతర రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయాలు వెలుస్తున్నాయి. తాజాగా తెలంగాణ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ భారతీయ రాష్ట్ర సమితి ( బిఆర్‌ఎస్ ) రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. విజయవాడ వద్ద బిఆర్‌ఎస్ కార్యాలయం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఆ పార్టీ నాయకులు తాజాగాజక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్డు హైవేపై సుమారు 800 గజాల్లో భారతీయ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
ఈ స్థలాన్ని తెలంగాణ బిఆర్‌ఎస్ నేతలు పరిశీలించారని తెలుస్తోంది. ఈ నెల 18, 19 తేదీల్లో స్థలాన్ని పరిశీలించేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా విజయవాడకు రానున్నారంటున్నారు. ఇది ఓకే అనుకుంటే.. త్వరలోనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బిఆర్‌ఎస్ పార్టీ ఎపి రాష్ట్ర కార్యాలయం శంకుస్థాపనకు హాజరమయ్యే అవకాశం ఉందని బిఆర్‌ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News