Sunday, December 22, 2024

బిఆర్ఎస్ గా మార్చాలని ఎంపిల విజ్ఞప్తి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభల్లో టిఆర్ఎస్ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చాలని ఆ పార్టీ ఎంపిలు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ఖడ్, లోకసభ స్పీకర్ ఓం బిర్లా ను టిఆర్ఎస్ ఎంపిలు కలిసి కెసిఆర్ పంపిన లేఖను అందజేశారు. టిఆర్ఎస్ ఎంపిల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన రాజ్యసభ ఛైర్మన్ పార్టీ పేరును ఇకపై బిఆర్ఎస్ గా మార్చాలని అధికారులకు ఆదేశించారు. టిఆర్ఎస్ ఎంపిల విజ్ఞప్తి పై లోకసభ స్పీకర్ ఓం బిర్లా సానుకూలంగా స్పందించారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఎంపిలకు ఓం బిర్లా చెప్పారు. సిఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా మార్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News