మనతెలంగాన/ఆసిఫాబాద్: బిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా ఆవిర్భావం అనంతరం తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని మహారాష్ట్ర ప్రజల చూపు బీఆర్ఎస్ పార్టీవైపు మల్లింది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అక్కడి ప్రజలు ఆకర్శితులు అవుతున్నారు. ఢీల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు అనంతరం మహారాష్ట్రలోని సౌండ, లక్కడ్ కోట్, రాజురా తదితర ప్రాంతాల ప్రజలు, నాయకులు ఇటీవల జెడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, పార్టీ అధ్యక్షుడు కోనేరు కోనప్ప, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్ రావులను మర్యాదపూర్వకంగా కలిశారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసేందుకు సహాకారం కావాలని స్వచ్చంధంగా అక్కడి ప్రజలు కోరుతున్నాట్లు అరిగెల నాగేశ్వర్రావు తెలిపారు. ఈ క్రమంలో రెండు రోజులుగా సరిహద్దు ప్రాంతం అయిన సోండ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. సీఎం కేసీఆర్, కేటీఆర్ తో పాటు జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు, జెడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఫోటోలతో పాటు అక్కడి యువతతో కూడి నూతన సంవత్సర శుభాకాంక్షల తో ప్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటున్నారు, మహారాష్ట్ర లో బిఅరెస్ పార్టీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని అక్కడి యువకులు చెపుతున్నారు.