Monday, December 23, 2024

మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ తొలి విజయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహారాష్ట్ర రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన బీఆర్‌ఎస్.. బోణి ప్రారంభించింది. తొలి ప్రయత్నంలో సర్పంచ్ పదవిని సొంతం చేసుకుంది. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా గంగాపూర్‌లోని సావ్‌ఖేడ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలో బిఆర్‌ఎస్ బలపరిచిన సుష్మా విష్ణు ములే సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుష్మా విష్ణు ములే సర్పంచ్గా ఎన్నికవ్వడంతో.. బిఆర్‌ఎస్ పార్టీ మహారాష్ట్రతో పాటు గంగాపూర్ ఖుల్తాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టినట్లు అయింది. ఈ ఎంపిక ప్రక్రియను స్వయంగా బిఆర్‌ఎస్ నాయకులు పర్యవేక్షించారు.

బహుజనుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకువస్తున్న పథకాలు, సంక్షేమాలను చూసి అక్కడి ప్రజలు ఆకర్షితులవుతున్నారు. దళిత బంధు, రైతు బంధు, ఉచిత విద్యుత్, సాగు నీరు వంటి పథకాలను కూడా మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే అందిస్తామని జరిగే సమావేశాల్లో సిఎం కెసిఆర్ చెబుతుండటంతో మహారాష్ట్ర ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీకి తమ మద్దతు తెలుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News