Tuesday, January 21, 2025

మూడోసారి బిఆర్ఎస్ దే విజయం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: మూడోసారి కూడా బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం తుర్కపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కెసిఆర్ రోల్ మోడల్ గా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే, మోడీ జీర్ణించుకోలేక తన అక్కసు వెళ్లగక్కుతూ విషం చిమ్మితున్నారని మండిపడ్డారు.

Also read: నెలాఖరులో జెఇఇ మెయిన్ 2 ఫలితాలు..?

కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న బిజెపికి ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదని ఆమె విమర్శించారు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతిష్టకు కంకణ బద్ధులై పనిచేసి, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు చైతన్యవంతం చేయాలని పార్టీ శ్రేణులకు అమే దిశ నిర్దేశం చేశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News