Monday, December 23, 2024

మళ్లీ అధికారం మనదే: గొంగిడి మహేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సంక్షేమానికి చిరునామా తెలంగాణ
ఎన్ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి
బిఆర్ఎస్ లో చేరిన కురుమలు

మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: రానున్న ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఎన్ డి సి సి బి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలోని గొంగిడి నిలయంలో ఆలేరు మండలం బైరాం నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కురుమ సంఘం యువకులు, శర్బనాపురం గ్రామం చెందిన సిపిఎం యువకులు భారీ సంఖ్యలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారందరికీ పార్టీ కండువాలు కప్పి మహేందర్రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి ప్రసంగించారు. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ పథకాలు రూపొందించారన్నారు.  వ్యవసాయాన్ని ఒక పండుగలుగా మార్చారన్నారు. ఉచితంగా గొర్రెలను పంపిణీ చేసి.. గొల్ల కురుమల సంక్షేమానికి కృషి చేశారని ప్రశంసించారు. మాంసం ఉత్పత్తిలోనూ తెలంగాణ నంబర్ వన్ గా ఉందన్నారు. పార్టీలో కొత్త, పాత లేకుండా అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు పాల సంఘం మాజీ చైర్మన్ గవ్వల ప్రభాకర్, టెంపుల్ వ్యవస్థాపక అధ్యక్షులు నంద సంతోష్ కుమార్, కురుమ సంఘం అధ్యక్షుడు గవ్వల గణేష్, మాజీ అధ్యక్షుడు గవ్వల యాదగిరి, కార్యదర్శి నంద శ్రీను, విద్యా కమిటీ మాజీ చైర్మన్ దూడ శ్రీను, నంద నర్సింహులు, నంద సిద్దులు, నంద శ్రీశైలం, దూడల శ్రీరాములు, వగ్గు లవకుమార్, డివైఎఫ్ఐ కార్యదర్శి ఏదూ సాయి, ఏదు నవీన్, ప్రశాంత్, మల్లేష్, వెంకటేష్, మహేష్, సూర్య కిరణ్ తదితరులతోపాటు 200 మంది ఉన్నారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ మొగలిగాని మల్లేష్ గౌడ్, పార్టీ కోశాధికారి మహేందర్, సీనియర్ నేత ఎం ప్రవీణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు అంగడి బిక్షపతి, వార్డు సభ్యుడు బోడ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News