- Advertisement -
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ పార్టీ దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
పార్టీ మారిన ఎంఎల్ఎలపై అనర్హత వేటు వేయాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై రెండు పిటిషన్లు దాఖలు చేశారు. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్ కుమర్, కృష్ణమోహన్, మహిపాల్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, అరికెపూడి గాంధీపై కోర్టులో బిఆర్ఎస్ రిట్ పిటిషన్ వేయగా..
దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై ఎస్‌ఎల్పీ పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ ఫిరాయింపులపై ప్రస్తుతం ఢిల్లీలో మాజీ మంత్రి హరీష్‌రావు, లాయర్లతో చర్చిస్తున్నట్లు సమాచారం.
- Advertisement -