Monday, January 20, 2025

బిఆర్‌ఎస్ కుటుంబ సభ్యులకు బీమాతో భరోసా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/దామెర: పార్టీ కోసం కష్టపడిన ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ భరోసాగా నిలుస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ నాయకుడు నల్ల బిక్షపతి ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందగా పార్టీ ప్రమాద బీమా నుంచి మంజూరైన రూ. రెండు లక్షల చెక్కును ఎమ్మెల్యే చల్లా బిక్షపతి కుటుంబ సభ్యులకు అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్న ప్రతీ సభ్యుడి కుటుంబానికి నేనున్నానంటూ సీఎం కేసీఆర్ భరోసాగా నిలిచి వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తున్నారన్నారు. దీనివల్ల కార్యకర్తల కుటుంబాలకు ఎంతో కొంత పార్టీ ద్వారా ఆర్థికసాయం అందుతుందన్నారు. అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తుందన్నారు. ప్రతీ పథకాన్ని రాష్ట్రంలో ప్రజల ముంగిటకు తీసుకెళ్లిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. అలాగే పార్టీ కోసం కష్టపడే ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News