Monday, December 23, 2024

గులాబీ గుబాళింపు

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కంధార్ నియోజకవర్గం లోహా పట్టణంలో నేడు బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. బైల్ బజార్లో 15 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ముస్తాబయ్యింది. ప్రధాన రహదారులను గులాబీ తోరణాలు, భారీ హోర్డింగుల తో కళకళలాడుతోంది. బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లను ఆర్మూర్ ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి, బోధన్ ఎంఎల్‌ఎ షకీల్, బిఆర్‌ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్‌రావు కదం, కం ధార్ మాజీ ఎంఎల్‌ఎ శంకరన్న దోండ్గె, కన్నా డ్ మాజీ ఎంఎల్‌ఎ హర్షవర్ధన్ జాదవ్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలో కాంగ్రెస్, బిజెపి, శివసేన కాకుండా మరే పార్టీ ఈ స్థాయి లో సభను నిర్వహించలేదు. దీంతో సభా ఏర్పాట్లను చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
లక్ష మందికి పైగా..
బిఆర్‌ఎస్ నేతలు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూనే మరోవైపు తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో తిరుగుతూ సభకు గురించి పార్టీ వి ధానాలను ప్రజలకు తెలియచెప్పారు. పర్భణి, లాతూర్, నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఊరూరా ముమ్మర ప్రచార కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు నిర్వహించాయి. ముఖ్యంగా కంధార్, లోహా, కన్నాడ్, డెగులూర్, పూర్ణా, గంగాఖేడ్, ముద్ఖే డ్, పత్రి, పాలా, చందోలి, చౌక్, మన్వర్, అ హ్మదాపూర్, ధర్మాబాద్, బిలోలితో పాటు ఇత ర నియోజకవర్గాలు, తాలూకాల ప్రజల సమస్యలను బిఆర్‌ఎస్ నాయకులు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సభకు లక్షకు పైచిలుకు ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండడం,

భారీ గా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉండడంతో ఈ సభను విజయవం తం చేయడానికి బిఆర్‌ఎస్ శ్రేణులు తమవంతు కృషి చేస్తున్నారు. భారీ బహిరంగ సభ స్థలి ఏర్పాట్లను, మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు, కాందహర్ మాజీ ఎంఎల్‌ఎ, ఎన్‌సిపి కిసాన్ సెల్ అధ్యక్షుడు శంకరన్న ధోంగే శనివారం పరిశీలించారు. తెలంగాణకు చెందిన బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు గుడాల భాస్కర్, అమృత్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News