Wednesday, January 22, 2025

రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్‌ఎస్ ర్యాలీ, దిష్టిబొమ్మ దహనం

- Advertisement -
- Advertisement -

బోనకల్ : రాష్ట్రంలో చిన్న రైతులకు మూడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తే సరిపోతుందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలకు నిరసనగా బోనకల్ మండల కేంద్రంలో ఖమ్మం జడ్పీచైర్మన్ కమలరాజు ఆద్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. తొలుత జడ్పీచైర్మన్ కమలరాజు, జిల్లా నాయకుడు కొండబాల కోటేశ్వరావుతో కలిసి జానకీపురం, రాపల్లి గ్రామాలలో సిసి రోడ్ల నిర్మిణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కార్యకర్తలతో జానకీపురం నుంచిమోటారు సైకిల్ ర్యాలీగా బోనకల్ ప్రధాన కూడలి వద్దకు చేరుకొని అక్కడ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్బంగా కమలరాజు, కొండబాల మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆటలాడుకొన్నారని విమర్శించారు. నాడు రైతులను పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు నేడు ఏదో చేస్తామని చెబుతున్నారని దాంట్లో భాగంగా రైతులకు తక్కువ సమయం విద్యుత్ సరఫరా చేస్తే సరిపోతుందని ఎంతవరకు సబబన్నారు. కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులను అనేక రకాలుగా ఆదుకొన్నారని అన్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వంగా కెసిఆర్ ప్రభుత్వం అనేక విజయాలు సాధించిందన్నారు. ఈకార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షుడు వేమూరి ప్రసాద్, మధిర ఎఎంసి చైర్మన్ బంధం శ్రీనివాసరావు, మండల బిఆర్‌ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు చేబ్రోలు మల్లిఖార్జునరావు, మోదుగుల నాగేశ్వరావు, తమ్మారపు బ్రహ్మం, కాకాని శ్రీనివాసరావు, యనమద్ది శ్రీనివాసరావు, చంద్రం. తోటకూర అనంతరాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News