మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ సెంట్ మెంట్ జిల్లా కేంద్రం నుండే పార్లమెంట్ తొలి ఎన్నికల శంఖారావాన్ని గులాబీ బాస్ కెసిఆర్ పూరించనున్నా రు. అందుకు మంగళవారం ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మై దానం నుంచి సాయంత్రం 4 గంటలకు పార్లమెంట్ ఎ న్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. పార్లమెంట్ పరి ధి లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీ సం ఖ్యలో గులాబీ, శ్రేణులు, అభిమానులు, ప్రజలు తరలి రానున్నారు.
దాదాపు లక్షకుపైగా తరలివస్తారని పార్టీ శ్రేణులు పేర్కొ న్నాయి. అందుకుగా అన్ని ఏర్పాట్లు చే శారు. కెసిఆర్ రాక సందర్భంగా కరీంనగర్ నగరమం గులాబీమయంగా మారింది. ఈ నేపథ్యంలో సోమవారం కదనభేరి బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి స్థానిక ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్, మేయర్ యాదగిరి సునీల్ రావు, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ ఎంఎల్‌సి నారదాస్ లక్ష్మణ్‌రావు తదితరులు పరిశీలించారు. పార్లమెంట్‌లో మళ్లీ ప్రశ్నించే గొంతు వినబడాలంటే ప్రజలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి తమ బిఆర్‌ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కెసిఆర్ ప్రజలను కోరనున్నారు. నేటి బహిరంగా సభకు సిరిసిల్ల, హుస్నాబాద్, మానకొండూరు, వేములవాడ, చొప్పదండి, హుజురాబాద్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కెసిఆర్ సెంటిమెంట్ జిల్లా నుండే ప్రారంభించే లోక్‌సభ ఎన్నికల కదనరంగం దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు.