Monday, December 23, 2024

ఆస్తుల చిట్టా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బిఆర్‌ఎస్ ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. కెసిఆర్ పా లనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేలా కెసిఆర్ హయాంలో సృష్టించిన ఆ స్తుల జాబితాను డాక్యుమెంట్‌గా రూపొందించి బిఆర్‌ఎస్ పార్టీ విడుదల చేసింది. ఈ డాక్యుమెంట్‌లో కెసిఆర్ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను వెల్లడించింది. కెసిఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చే సింది. ప్రభుత్వ శ్వేతపత్రానికి ధీటుగా కౌంటర్ ఇచ్చేలా బిఆర్‌ఎస్ కెసిఆర్ పాలనలో జరిగిన ఆర్థిక ప్రగతి వివరిస్తూ డాక్యుమెంట్ విడుదల చేసింది.

పదేళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తులు
రాష్ట్రంలో 10జిల్లాలను 33 జిల్లాలకు పెంపొందించి, 30 జిల్లాల్లో రూ.1649.62 కోట్ల వ్యయంతో జిల్లా కలెక్టరేట్ భవనాలు నిర్మించగా, అందులో ఇప్పటికే 25 భవనాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటికి ఆర్ అండ్ బి రోడ్లు 24,245 కిలో మీటర్లు ఉండగా, ప్ర స్తుతం 32,717 కిలో మీటర్లు ఉంది.పదేళ్లలో రాష్ట్రంలో 8,578 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు వేశారు. అందులో రెండు లేన్ల రోడ్లు 8,218 కిలో మీటర్లు ఉండగా, నాలుగు లేన్ల రోడ్లు 321 కిలోమీటర్లు, ఆరు లేన్ల రోడ్లు 39 కిలో మీటర్లు ఉన్నాయి. కొత్తగా 382 బ్రిడ్జిలు నిర్మించారు.2014కు ముందు చెత్త సేకరణ వాహనాలు 2,548 ఉండగా, ప్రస్తుతం 4,713 వాహనాలు ఉన్నా యి. రోజువారీ చెత్త సేకరణ 2014లో రోజుకు 2675 టన్నులు ఉండగా, ప్రస్తుతం 4356 టన్నులకు చేరింది.

1022కు పెరిగిన గురుకులాలు
2014కు ముందు రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనా ర్టీ, జనరల్ గురుకులాలు మొత్తం 293 ఉండగా, పదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం గురుకుల విద్యాలయాలను 1022కు పెంచింది. మన ఊరు మన బడి పథకం కింద మూడు విడతల్లో 1240 బడుల నిర్మాణం చేపట్టగా, అం దులో మొదటి విడతలో రూ.3497.62 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పనులు చేపట్టారు. ఈ పథకం కింద మొత్తం 7289.54 కోట్లు ఖర్చు చేయగా, 23,37, 654 మంది విద్యార్థులు లబ్దిపొందారు. అలాగే 1521 బడుల్లో సౌరవిద్యుత్ వినియోగం అందుబాటులోకి తె చ్చారు. గంభీనరావుపేటలో తొలి కెజి టు పిజి క్యాంపస్ ఏర్పాటు చేశారు. అందులో 70 గదులు నిర్మించి, 3500 మంది విద్యార్థులు చదువుకునేలా ఏర్పాట్లు చేశారు. 250 మందికి సరిపడేలా అంగన్‌వాడీ కేంద్రం, వెయ్యి మంది ఒకేసారి కూర్చునేలా డైనింగ్ హాలు నిర్మించారు.

పదేళ్లలో పారిశ్రామిక విప్లవం
2014కు ముందు రాష్ట్రంలో సుమారు 12 వేల పరిశ్రమలు ఉండగా, పారిశ్రామిక రంగానికి అప్పటి ప్రభు త్వం రూ.300 కోట్లు కేయించింది. అప్పటి ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు రూ.200 కోట్లు కేటాయించగా, సగటున 5 గంటల విద్యుత్ సరఫరా అయ్యేది. కరెంట్ లేక సుమారు 10 వేల పరిశ్రమలు మూతబడ్డాయి. పారిశ్రామిక రంగంలో 6,64,000 మంది ఉపాధి పొందారు. 2014 తర్వాత కొత్తగా 23 వేల పరిశ్రమలు ఏర్పాటు కాగా, 2023 24 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలకు ప్ర భుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించింది. తొమ్మిదిన్నరేళ్లలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.9,500 కో ట్లు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు 24 గంటల విద్యుత్ సరఫరా చేసింది. బిఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కరెంట్ లేక ఒక్క పరిశ్రమ కూడా మూతపడలేదు.

పరిశ్రమల ద్వారా 17.17 లక్షల మంది ఉపాధి పొం దారు. ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.2.65 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఎస్‌సి పారిశ్రామికవేత్తలకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.1,400 కోట్ల ప్రోత్సాహకాలు అందజేసింది. పరిశ్రమల కోసం ప్రభుత్వం 1.45 లక్షల ఎకరాల భూమి నిర్థారించగా, ఇప్పటివరకు 28 వేల ఎకరాలను కేటాయించింది. 2014 తర్వాత 3.3 లక్షల కోట్లకు పైగా రాష్ట్రానికి పెట్టుబడులు రాగా, ఈ పరిశ్రమల ద్వారా 22.5 లక్షల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. తొమ్మిదిన్నరేళ్లలో 334 చిన్న పరిశ్రమలను పునరుద్దరించగా, 10.400 ఎకరాల్లో అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు.

ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు
తొమ్మిదిన్నరేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో ఆరోగ్య రంగంలో వి ప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.2014కు ముందు 17400 పడకలు ఉండగా, 2023 నాటికి రెట్టిం పై పడకలు 34 వేలకు చేరుకున్నాయి. 1400 ఉన్న ఆక్సిజన్ బెడ్లను 30 రెట్లు పెంచి 34 వేలకు బిఆర్‌ఎస్ ప్ర భుత్వం పెంచింది.ఐదు ఉన్న ఐసియు కేంద్రాలు, 16 రె ట్లు పెరిగి 80కి చేరాయి. 2014కు ముందు 28 ఉన్న బ్ల డ్ బ్యాంకులు, రెట్టింపై 56కు పెరిగాయి. మూడు ఉన్న డయాలసిస్ కేంద్రాలు 82కు పెరగగా, బస్తీ ప్రజలకు వై ద్య సేవలు అందించేందుకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం 500 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌నగరం నలుదిక్కులా అల్వాల్,ఎర్రగడ్డ, గడ్డిఅన్నారం వెయ్యి పడకలతో టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టగా, గచ్చిబౌలిలో 1261 పడకలతో టిమ్స్ ఆసుపత్రిని అప్పటిప్ర భు త్వం ఏర్పాటుచేసింది.నిమ్స్‌ఆసుపత్రిని రూ.1571 కోట్లు వెచ్చించి, 2 వేల పడకలకు పెంచేందుకు ఇప్పటికే శంకుస్థాపన చేయగా,

ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వరంగల్‌లో రూ.3779 కోట్ల నిర్మాణ వ్యయం తో 2 వేల పడకలతో 15 ఎకరాలలో 24 అంతస్తుల్లో వరంగల్ స్పూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించింది. 2014కు ముందు మూడు మెడికల్ కాలేజీలు ఉండగా, 2023 నాటికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 33కు చేరాయి. 2014కు ముందు 2850 ఎం బిబిఎస్ సీట్లు ఉం డగా, 2023లో 8515కు పెరిగాయి. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 850 సీట్లు ఉం డగా,2023లో 3915కు పెరిగాయి.అదేవిధంగా 2014 కు ముందు 1183 పిజి సీట్లు ఉండగా,బిఆర్‌ఎస్ ప్రభు త్వం 2023 నాటికి మెడికల్ పిజి సీట్లను 2890కు పెంచింది. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 515 పిజి సీట్లు ఉండగా, 2023 నాటికి 1320కి పెరిగాయి.

ఆథ్యాత్మికతకు అధిక ప్రాధాన్యత
తొమ్మిదిన్నరేళ్ల కెసిఆర్ పాలనలో రూ.2,800 కోట్లతో ఆలయాలు అభివృద్ధి చేయగా, రూ.1200 కోట్లతో యా దాద్రి ఆలయాన్ని పునర్నిర్మించారు. 2014కు ముందు దేవాదాయశాఖకు, దేవాలయాల పునరుద్దరణకు, ప్రధా న ఆలయాల అభివృద్ధికి,బ్రాహ్మణుల సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. 2014 తర్వాత దేవాదా య శాఖకు రూ.100 కోట్లు నిధులు కేటాయించగా, ధూపదీప నైవేద్యం పథకం కింద అర్చకుల వేతనాలు సంవత్సరానికి రూ.75 కోట్లు కేటాయించారు. అలాగే తొమ్మిదిన్నరేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో ఆలయాల అభివృద్ధికి రూ.2800 కోట్లు ఖర్చు చేయగా, బ్రాహ్మణుల సం క్షేమం కోసం రూ.212కోట్లను ఖర్చు చేసింది.

జలబాండాగారం కాళేశ్వరం
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంను బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఈ ప్రాజెక్టులో మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు ఉండగా, మొత్తం 82 లిఫ్ట్ పంపులు ఉన్నాయి. 13 జిల్లాల పరిధి కలిగిన ఈ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థం 140 టిఎంసిలు. 2014కు ముందు ఉమ్మడి జిల్లాల్లో 6,65,255 ఎకరాల్లో సేధ్యం జరుగగా, 2014 తర్వాత కొత్తగా 7,27,968 ఎకరాలు సాగులోకి వచ్చాయి. తొమ్మిదిన్నరేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో మొత్తం 137 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు వరమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్ పంప్ హౌజ్‌ను మాజీ సిఎం కెసిఆర్ ప్రారంభించారు.

2013తో పోల్చితే రాష్ట్రంలో నాలుగు మీటర్ల భూగర్భ జలమట్టం పెరిగింది. 2013లో 13,390 ఎంసిఎం జలాలు అందుబాటులో ఉండగా, 2023లో 20,920కి పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పా టు తర్వాత మొత్తం భూగర్భ జలాల లభ్యత 56 శాతం మేరకు పెరిగింది. తెలంగాణలో మొత్తం సాగు విస్తీర్ణం 201314లో1,31,34,000 ఎకరాలుఉండగా, 2022 లో 1,98,37,000 ఎకరాలకు పెరిగింది. ఇటీవల కాం గ్రెస్ ప్రభుత్వ విడుదల చేసినగణాంకాల ప్రకారం రా ష్ట్రంలో సాగు విస్తీర్ణం 51.04% పెరుగుదల నమోదైంది.

విద్యుత్ వెలుగులు
తెలంగాణ రాష్ట్రంలో 2014కు ముందు 7,778 మెగావాట్ల విద్యుత్ సామర్థం ఉండగా, 2023లో 19,464 మెగావాట్లకు పెరిగింది. అలాగే సౌర విద్యుత్ 74 మెగావాట్ల నుంచి 5,741 మెగావాట్లకు పెరిగింది. 2014కు గరిష్ట విద్యుత్ డిమాండ్ 5,661 మెగావాట్లు ఉండగా, 2023లో 15,497 మెగావాట్లకు చేరింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 2014లో 19.03 లక్షలు ఉండగా, 2023లో 27.87 లక్షలకు పెరిగాయి. అలాగే వ్యవసాయ విద్యుత్ సరఫరా 2014కు ముందు 4 నుంచి 6 గంటలు ఉండగా, 2023లో 24 గంటల ఉచిత విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. గృహ వాణిజ్య రంగాలకు 2014కు ముందు 4 నుంచి 8 గంటల విద్యుత్ సరఫరా ఉండగా,

2023లో 24 విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది. పరిశ్రమలకు పవర్ హాలీ డేలు 2014కు ముందు వారానికి రెండు రోజులు ఉండగా, 2023లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది. 2014లో తలసరి విద్యుత్ వినియోగం 1356 యూనిట్లు ఉండగా, 2023లో 2140 యూనిట్లకు పెరిగింది. రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 57.82 శా తంగా నమోదైంది. 2014లో విద్యుత్ సంస్థల అప్పులు రూ.22,423 కోట్లు ఉండగా, 2023లో 81 వేల కోట్లకు చేరాయి. అలాగే విద్యుత్ సంస్థల ఆస్తులు 2014లో రూ. 44,431 కోట్లు ఉండగా, 2023లో 1,37,571 కోట్లకు పెరిగాయి. మొత్తం విద్యుత్ అప్పుల్లో రూ.59 వేల కోట్లు పెరగగా, ఆస్తులు 93 వేల కోట్లకు పెరిగాయి.

రాష్ట్ర గౌరవానికి ప్రతీక డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయం
100 ఏళ్ల వరకు పాలన అవసరాలకు ఢోకా లేకుండా బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.617 కోట్లతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని నిర్మించింది. 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 28 ఎకరాలలో 7 అంతస్తుల్లో రాష్ట్ర సచివాలయ భవనం కెసిఆర్ ప్రభుత్వం నిర్మించింది. నూతన సచివాలయంలో మంత్రులు, అధికారులకు ఒకే చోట కార్యాలయాలు ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర రాజధాని నడిబొడ్డున 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 11.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.146. 50 కోట్లతో ర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం దేశంలో అత్యంత ఎత్తైనది. అదేవిధంగా అమరుల త్యాగాలను గుర్తు చేసుకునేలా 150 అడుగుల స్మారకం, 26 అడుగుల దీపం ఏర్పాటు చేశారు. మొత్తం మూడు ఎకరాల ప్రాంగణంలో రూ.178 కోట్ల వ్యయంతో నిర్మించింని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం ప్రపంచంలోనే అతిపెద్ద స్టీమ్‌లెస్ స్టీల్ భవనం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News