- Advertisement -
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి బిఆర్‌ఎస్ తీర్మానం చేరింది. టిఆర్‌ఎస్ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిశారు. టిఆర్‌ఎస్ విసృత స్థాయి సమావేశంలో నేతలు బిఆర్‌ఎస్‌గా పేరు మారుస్తూ తీర్మానం అందించారు. ఏ పార్టీ పేరు మార్చిన వెంటనే ఎన్నికల సంఘానికి తెలియజేయాలనే రూల్ ఉందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిపల్లి వినోద్ కుమార్ తెలిపారు. గతంలో భారత్ రాష్ట్ర సమితి పేరు మీదా ఏమైనా దరఖాస్తులు ఉన్నాయా? లేదా అనేది పరిశీలిస్తారన్నారు. చట్టం ప్రకారం 29 ఎ సెక్షన్ సబ్ క్లాస్ 9 రూల్ ప్రకారం ఎన్నికల సంఘానికి తమ పార్టీ పేరును పరిశీలిస్తుందన్నారు. మిగిలిన విషయాలు సిఎం కెసిఆర్ బిఆర్‌ఎస్ పార్టీ గురించి, ఆలోచనలు వివరిస్తారన్నారు.
- Advertisement -