Thursday, December 26, 2024

గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా బిఆర్‌ఎస్ పాలన

- Advertisement -
- Advertisement -

బిజినేపల్లి : రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం బిజినేపల్లి మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ హసీనా బేగం, ఉప సర్పంచ్ తయ్యాబ్, వార్డు సభ్యులు గుంత కృష్ణ, సీనియర్ నాయకులు ఎండి కుతుబ్, మొల్ల జంగీర్, కదిరే బురాన్, 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడి ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. అందుకోసం కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్‌ఎస్ పార్టీలో చేరడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News