Sunday, December 22, 2024

పట్నంకు గులాబీ ఝలక్….!

- Advertisement -
- Advertisement -

జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి పై అవిశ్వాసం
12 మంది జడ్పీటీసీలు అదనపు కలెక్టర్ లింగానాయక్ కి అవిశ్వాస నోటీసులు
మన తెలంగాణ/ వికారాబాద్ జిల్లా ప్రతినిధి: గులాబీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పట్నం ఫ్యామిలీకి 24 గంటలు గడవక ముందే గులాబీ దళం ఝలక్ ఇచ్చింది. వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డిపై గులాబీ దళం కు చెందిన 12 మంది జడ్పీటీసీ లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం సంచలనం రేపింది. పట్నం ఫ్యామిలీతో విభేదించే మాజీ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, ఆనంద్, మహేష్ రెడ్డి లతో పాటు మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి సైతం అవిశ్వాస తీర్మానం వెనక సూత్రదారులుగా వుంటూ వ్యవహారం నడుపుతున్నారు. సునీత రెడ్డిని గద్దె దించి పైలట్ తల్లి ప్రమోదినీ రెడ్డిని జడ్పీ చైర్ పర్సన్ చేసే యోచనలో గులాబీ పార్టీ స్కెచ్ వేసింది. క్యాంప్ రాజకీయాల్లో ఆరితేరిన మహేందర్ రెడ్డిని తట్టుకొని జడ్పీటీసీలను కాపాడుకోవడం గులాబీ దళానికి కష్టం కావడంతో 12 మంది జడ్పీటీసీలను క్యాంప్ లకు తరలించడానికి గులాబీ దళం సిద్ధం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News