Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌ను గ్రామస్థాయిలో మరింత పటిష్టం చేయాలి

- Advertisement -
- Advertisement -
  • బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్ కుమార్‌రెడ్డి

మంచాల: గ్రామస్థాయిలో బిఆర్‌ఎస్ పార్టీని మరింత పటిష్టం చేయాలని బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మండల పరిధిలోని ఆరుట్ల గ్రామానికి పార్టీ పరిశీలికుడుగా సోమవారం గ్రామంలో పర్యటించారు.

అనంతరం గ్రామశాఖ అధ్యక్ష, కార్యదర్శులు పుణ్ణం రాము, మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ప్రభుత్వ పథకాలే పార్టీని రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి తీసుకొస్తుందని అన్నారు.

నియోజక వర్గంలో పార్టీ గెలుపే లక్షంగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా దళిత బంధు లబ్ధిదారుడు మంకు వినోద్ కుమార్ పెయింట్ షాపును పరిశీలించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిందం రఘుపతి, నూతనగంటి శేఖర్, మార్కెట్ కమిటీ డైరక్టర్ ఎండి జానీపాషా, చిందం జంగయ్య, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News