- Advertisement -
హైదరాబాద్: సింగరేణి గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ బిఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. సింగరేణి కార్మికులతో కలిసి భూపాలపల్లిలో నిర్వహించిన ఆందోళనలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ…. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ సహకరించట్లేదని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి సైరన్ ప్రధానికి చేరాలన్నారు. రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాల ఇవ్వనందుకు కేంద్రానికి సహకరించాలా?.. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సిఎం కెసిఆర్ సహించారని తెలిపారు. సింగరేణి ప్రైవేటుపరం చేయట్లేదని ప్రధాని ఎందుకు అనలేదని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు.
- Advertisement -