Friday, January 10, 2025

ప్రజా ఆరోగ్యంపై బిఆర్‌ఎస్ ప్రత్యేక శ్రద్ధ

- Advertisement -
- Advertisement -
  • మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్

గజ్వేల్: ప్రజా ఆరోగ్యంపై బిఆర్‌ఎస్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆహ్మదిపూర్ గ్రామానికి చెందిన ఉడిది సత్తయ్యకు ప్రమాదం సంభవించగా వారికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం రూ. 50 వేల 700 చెక్కును మంత్రి హరీశ్‌రావు సహకారంతో మంజూరైన సిఎంఆర్‌ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావులు వైద్య రంగంలో ఘననీయంగా మార్పులు తెచ్చారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అనతి కాలంలో వైద్యారోగ్య శాఖలో ఎన్నెన్నో అద్భుతాలు రోజు చూస్తున్నామన్నారు.

పల్లె నుంచి పట్నం దాకా పేద ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రైవేట్‌కు దీటుగా వైద్య సేవలు విస్తరించారన్నారు. రానున్న రోజుల్లో సిఎం కెసిఆర్‌కు మనందరం వెన్నుదన్నుగా నివాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల అధ్యక్షుడు మద్ది రాజిరెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ చాడ శ్రీనివాస్‌రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేశ్ గౌడ్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఆహ్మద్, బిఆర్‌ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు నిజామోద్దిన్, ముత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News