Monday, December 23, 2024

కార్యకర్తలకు అండగా బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

చిన్నచింతకుంట : బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మద్దూరు గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ కార్యకర్త పద్మ ప్రమాదంలో మృతి చెందడంతో శనివారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నేరుగా బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి భర్త వెంకటయ్యగౌడ్‌కు బిఆర్‌ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన రూ. 2 లక్షల చెక్కు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు ఓ వైపు పార్టీ కోసం మరోవైపు ప్రజా ప్రయోజనం కోసం ఎండనకా వాననకా కృషి చేస్తున్న కార్యకర్తలకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వారి కుటుంబం రోడ్డున పడకుండా అండగా నిలవాలన్నదే సిఎం కెసిఆర్ లక్షమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి హర్షవర్ధన్‌రెడ్డి, అప్పంపల్లి సింగిల్‌విండో చైర్మన్ సురేందర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ అంజనమ్మ, బాలవర్ధన్, బిఆర్‌ఎస్ నాయకులు విష్ణువర్ధన్‌గౌడ్, నర్సిములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News