Monday, December 23, 2024

కార్యకర్తలకు అండగా బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

జమ్మికుంట: పార్టీ కార్యకర్తలకు బిఆర్‌ఎస్ పార్టీ ఎల్లవేళల అండగా ఉంటుందని ప్రభుత్వ విప్. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. బుధవారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 14వ వార్డుకు చెందిన అమిదాల వెంకటేశ్వర్లు అనే బిఆర్‌ఎస్ కార్యకర్త కొద్దిరోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా మృతుని భార్య శారధకు విప్ కౌశిక్‌రెడ్డి 2లక్షల ప్రమాద భీమా చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషిచేస్తూ, నమ్ముకొని ఉన్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జడ్పీటీసీ డాక్టర్ శ్రీరాం శ్యాం, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపళ్లి రాజేశ్వర్‌రావు, వైస్ చైర్‌పర్సన్ దేశిని స్వప్నకోటి, కౌన్సిలర్లు భోగం సుగుణ, దయ్యాల శ్రీనివాస్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News