కోదాడ : బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారని కోదాడ ఎమెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుంచి 100 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు.
వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలు బిఆర్‌ఎస్లో చేరుతున్నారని అన్నారు. ప్రతీ కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠదామం, డంపింగ్ యార్డ్, రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తున్నదని అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నదని అన్నారు. ప్రతీ పల్లెకు పక్కా రోడ్డును నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి కోదాడ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. బిఆర్‌ఎస్‌లో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కవిత రాధారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు సలీం, మండల మహిళా అధ్యక్షురాలు గీత, నాయకులు శేషు, ఖాజ, సురేష్, గాంధీ, బుచ్చయ్య, భిక్షం, అంబేద్కర్, ఆంజనేయులు, పార్టీలో చేరిన వారు పసుపులేటి నాగరాజు, నరేష్, వీరబాబు, రాములు, సైదులు, నాగరాజు, వెంకటనారాయణ, రమేష్, భాస్కర్, పసుపులేటి సైదులు, జానకి, సీతమ్మ తదితరులు పార్టీలో చేరారు.