Sunday, November 24, 2024

బిఆర్‌ఎస్ అంటే రైతు సంక్షేమ పార్టీ.. రైతు బాంధవుడు కెసిఆర్.. : హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అంటే రైతు సంక్షేమ పార్టీ అని మరోసారి నిరూపితం అయ్యిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతు బాంధవుడు కెసిఆర్ అని తెలిపారు. రైతు సంక్షేమమే లక్షంగా ఆది నుంచి బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు శ్రేయస్సుకు పెద్ద పీట వేసింది. రైతు బాగుంటేనే రాష్ట్రం సుసంపన్నమవుతుందని భావించే సిఎం కెసిఆర్ ఆ దిశగా అనేకానేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. అన్నదాతలైన రైతులు ఆర్థికంగా మరింత బలోపేతం చేసే లక్షంతో సిఎం కెసిఆర్ రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో భాగంగా గురువారం రోజు రూ.37 వేల నుండి రూ.41 వేల మధ్యన ఉన్న రుణాలు మాఫీ చేసేందుకు గానూ ఆర్థిక శాఖ రూ.167.59 కోట్లు విడుదల చేసిందని తద్వారా 44,870 మంది రైతన్నలకు లబ్ది చేకూరిందని మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News