Monday, December 23, 2024

ఎపిలో బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభానికి ముహుర్తం ఖరారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. గుంటూరు-1 మంగళగిరి రోడ్డు ఎఎస్ ఫంక్షన్ హాల్ పక్కన ఎపి బిఆర్‌ఎస్ కార్యాలయాన్ని ఈ నెల 21వ తేదీన (ఆదివారం) ఉదయం 11.35 గంటలకు ప్రారంభించనున్నారు. ఎపి బిఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు తోట చంద్రశేఖర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎపి ప్రజలు బిఆర్‌ఎస్‌ను చాలా బాగా ఆదరిస్తున్నారని చెప్పారు. ఇదిలా ఉంటే, ఇటీవల తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎపిలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో బిఆర్‌ఎస్ పోటీ చేయనున్నట్టుగా చెప్పారు. అలాగే ఎపిలోని 25 లోక్‌సభ స్థానాల్లో బరిలో దిగనున్నట్టుగా తెలిపారు. తెలంగాణ మోడల్ దేశమంతా విస్తరించాలని ప్రజలు ఆశిస్తున్నారని తోట చంద్రశేఖర్ చెప్పారు. బిజెపి దేశంలోని ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టిస్తోందని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News