ఎంఎల్‌సి ఎన్నికల్లో అభ్యర్థుల
మల్లగుల్లాలు 27న ఒక
గ్రాడ్యుయేట్, రెండు టీచర్
ఎంఎల్‌సి స్థానాలకు ఎన్నికలు
మూడు స్థానాలకు అభ్యర్థులను
ప్రకటించిన బిజెపి
గ్రాడ్యుయేట్‌కే పరిమితమైన
కాంగ్రెస్ పోటీకి బిఆర్‌ఎస్
దూరం నియోజకవర్గాల
వారీగా బిఆర్‌ఎస్ ఓట్లు చీలే
అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రెం డు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి స్థానాల ఎన్నికలకు ఈ నెల 27న పోలింగ్ జరుగనున్నది. మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎంఎల్‌సితో పాటు మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్, వరంగల్ -ఖమ్మం -నల్లగొం డ ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానాలకు ఎన్నిక లు జరుగనున్నాయి. ఈ మూడు ఎంఎల్‌సి స్థానాలకు రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు తమ అభ్యర్థులను ప్రకటించి ము మ్మర ప్రచారం చేస్తున్నాయి. బిజెపి పార్టీ మూడు ఎంఎల్‌సి స్థానాలకు పోటీ చేస్తుండ గా, కాంగ్రెస్ పట్టభద్రుల నియోజకవర్గంలో మాత్రమే తమ అభ్యర్థిని పోటీలో నిలిచింది. మూడు స్థానాలకు జరుగనున్న ఎంఎల్‌సి ఎ న్నికలకు బిఆర్‌ఎస్ పార్టీ దూరంగా ఉన్నది. అయితే బిఆర్‌ఎస్ పార్టీ ఓట్లు ఎవరికి అనుకూలంగా, ఎవరికి ప్రతికూలంగా మారుతా యో అని అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నా రు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎంఎల్‌సి ఎన్నికల్లో సాధారణంగా రాజకీయ పార్టీలు పోటీ చేయబోవని, ఉద్యమ సమయంలో తెలంగాణ వాదం ఎజెండాగా పార్టీ అధినేత కెసిఆర్ ఎంఎల్‌సి ఎన్నికలను ఉపయోగించుకున్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పలు ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఓటర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుందని, వాటి కంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.
అభ్యర్థులను బట్టి బిఆర్‌ఎస్ ఓట్లు పడే ఛాన్స్
ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎంఎల్‌సి స్థానాలకు బిఆర్‌ఎస్ పార్టీ అధికారికంగా ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను బట్టి బిఆర్‌ఎస్ ఓట్లు చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో బిఆర్‌ఎస్ పార్టీకి సన్నిహితంగా ఉన్న అభ్యర్థులు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నవారికి బిఆర్‌ఎస్ ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి. శాసనమండలిలో మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎంఎల్‌సి స్థానానికి జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఉపాధ్యాయ ఎంఎల్‌సిలుగా ఉన్న రఘోత్తం రెడ్డి, (మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్), అలుగుబెల్లి నర్సిరెడ్డి (వరంగల్ -ఖమ్మం -నల్లగొండ) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్ మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎంఎల్‌సి అభ్యర్థిగా.. అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఊటుకూరి నరేందర్‌రెడ్డి పోటీ చేస్తుండగా, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానానికి అభ్యర్థిగా నరోత్తమ్ రెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎంఎల్‌సి అభ్యర్థిగా మల్క కొమరయ్య, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎంఎల్‌సి అభ్యర్థిగా అంజిరెడ్డి బిజెపి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అలాగే ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు తమ అభ్యర్థులను ప్రకటించి ఆయా నియోజకవర్గాలలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు.
వరంగల్ -ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గానికి పింగిలి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ -మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్ నియోజకవర్గానికి వంగ మహేందర్ రెడ్డిని పిఆర్‌టియుటిఎస్ పోటీ చేస్తుంగా, జాక్టో తరపున వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి మాజీ ఎంఎల్‌సి పూల రవీందర్ పోటీ చేస్తున్నారు. టిఎస్ యుటిఎఫ్, టిపిటిఎఫ్ సంఘాలు వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ప్రస్తుత ఎంఎల్‌సి అలుగుబెల్లి నర్సిరెడ్డిని, మెదక్ -నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి టిపిటిఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వై అశోక్ కుమార్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానమైన గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి స్థానానికి కైవసం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. మంత్రులు ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తుండగా, సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓట్లు స్వతంత్ర అభ్యర్థులకు లేదా బిజెపి అభ్యర్థికి మళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానాలలో గతంలో బిఆర్‌ఎస్‌కు సన్నిహితంగా ఉన్న పిటిఆర్‌టియుటిఎస్ అభ్యర్థులు శ్రీపాల్‌రెడ్డి, వంగ మహేందర్‌రెడ్డిలకు కొన్ని ఓట్లు, జాక్టో అభ్యర్థి పూల రవీందర్‌కు కొన్ని పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అభ్యర్థుల ముమ్మర ప్రచారం
రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి స్థానాల ఎన్నికలకు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియనున్నది. ఎన్నికలకు మరో ఐదు రోజులే సమయం ఉండటంతో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలను పార్టీలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు ప్రష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఆయా పార్టీలు, సంఘాలు బలపరిచిన అభ్యర్థులను గెలిపించేకునేందుకు నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.ఒక గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలుపే లక్షంగా నాయకులు, అభ్యర్థులు పోటా పోటీ ప్రచారం నిర్వహిస్తున్నారు. సాధారణ ఎన్నికలను తలపించేలా వ్యూహ ప్రతి వ్యూహాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలు, సంఘాల నాయకులు జిల్లాల వారీగా బాధ్యతలు తీసుకుని తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు నాయకులు, అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మూడు ఎంఎల్‌సి స్థానాలకు ఈనెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.