Thursday, January 23, 2025

బిఆర్‌ఎస్ స్టీరింగ్ మా చేతిలో లేదు

- Advertisement -
- Advertisement -
  • ముస్లింలు తాకితే జగ్గారెడ్డికి కరోన వస్తదట
  • ఎంపి అసదుద్దీన్ ఓవైసి

సదాశివపేట: తెలంగాణలో బిజెపి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కేంద్రహోం మంత్రి అమిత్‌షాకు ఒక వ్యాపార వేత్త ఇల్లుకట్టించాడని, అక్కడే ఉండి తెలంగాణాలో పాగా వేసేందుకు అమిత్‌షా స్కెచ్ వేస్తున్నారని హైదారాబాద్ ఎంపి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి అన్నారు. సదాశివపేటలో రాత్రి ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షుడు గౌస్‌భాషా అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఓవైసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి ఓవైసి మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌ని సైతం టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. షాదీముబారక్ చెక్కులు సంవత్సరం గడిచిన రావడం లేదన్నారు.

అమిత్ షా హైదరాబాద్ వచ్చి బిఆర్‌ఎస్ స్టీరింగ్ మా చేతిలో ఉంటే పాత బస్తీకి మెట్రో రైలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మన భూ భాగంలోకి చైనా చొచ్చుకొస్తున్న బిజెపి పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఉద్యోగాల విషయంలో బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు అన్యాయం జరిగిందన్నారు. దేశం మొత్తం బిజెపి అధీనంలో ఉందని ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎక్కడ ఉన్నారని, ప్రజలకు అందుబాటులో ఉండని నాయకుడు జగ్గారెడ్డి అని విమర్శలు గుప్పించారు. ముస్లింలు జగ్గారెడ్డిని ముట్టుకుంటే కరోన వస్తదట, మరీ జగ్గారెడ్డికి ముస్లిం ఓట్లు కావాలీ కానీ మనం వద్దని అసద్ దుయ్యబట్టారు. సంగారెడ్డిలో 62వేల మైనార్టీల ఓట్లు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ సెక్రటెరియేట్ గుమ్మటాలు కూల్చుతామని బిజెపి వాళ్లు చెబుతున్నారని దమ్ముంటే బిజెపి నాయకులు కూలగొట్టాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు మొహీయొద్దీన్, మొజామ్ ఖాన్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News