Wednesday, January 22, 2025

బిఆర్ఎస్ మహాధర్నా …..

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం మహా ధర్నా నిర్వహించ నున్నట్లు ఆర్ అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత , ఎమ్మెల్యే లు జీవన్ రెడ్డి , బిగాల గణేష్ లు వెల్లడించారు. గురువారం నిజామాబాద్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ రైతులకోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వం రైతుల విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా ఎన్ ఆర్ జిఎస్ నిధుల తో తెలంగాణలో రైతులు ధాన్యం ఎండబెట్టుకోవడానికి కల్లలు నిర్మించుకున్నారని ఒక్కో రైతు కు రూ. 60, 70 వేల ఖర్చు అయిందన్నారు.కానీ యన్ ఆర్ జిఎస్ నిధులతో కల్లలు నిర్మించడంపై కేంద్రం కొర్రీలు పెట్టిందని కల్లాల కోసం వెచ్చించిన రూ 151 కోట్లు వాపస్ ఇవ్వాలంటూ కేంద్ర సర్కార్ తెలంగాణకు లేఖ రాయడం దుర్మార్గమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News