Thursday, January 23, 2025

మోడీ నిరంకుశ పాలన నశించాలి…

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు.  టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల , రైతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పన్నుల ప్రభుత్వం మోడిది అని, పనుల ప్రభుత్వం కెసిఆర్‌ది అని అన్నారు. రైతుల కల్లాల డబ్బులు రైతులకే చెల్లాలని నినాదాలు చేశారు. మోడీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాల పై నిరసనలు చేశారు. పంట కల్లాలకు ఉపయోగించిన నిధులు తిరిగి ఇవ్వాలని కేంద్రం ఒత్తిడి తేవడం హీనమైన చర్య అని నాయకులు మండిపడ్డారు.రాష్ర్ట ప్రభుత్వం రైతులకు చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం లేక రాసారని వాపోయారు. పంట కల్లాలు నిర్మిస్తే తప్పేందంటూ అన్నదాతలు కేంద్రప్రభుత్వాన్ని నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News