Sunday, January 19, 2025

ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు.  ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా స్వయంగా కెటిఆర్ ఆటో నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు. కెటిఆర్ తో బిఆర్ఎస్ ఎంఎల్ఎలు కూడా ఆటోలోనే అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. హామీ మేరకు ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అవుతోందని, 93 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని, ఆటో కార్మికులు ధైర్యాన్ని కోల్పోవద్దని, ఆటో డ్రైవర్లకు బిఆర్‌ఎస్ అండగా ఉంటుందని కెటిఆర్ హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News