- Advertisement -
యాదాద్రి భువనగిరి: నారాయణపురం ఎంపిపి గుత్తా ఉమాదేవిని బిఆర్ఎస్ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎంపిపి గుత్తా ఉమాదేవి, ఆమె భర్త ప్రేమ్ చందర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి తెలిపారు.
రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఇద్దరు కూడా పార్టీ నియమ, నిబంధనలు ఉల్లంగించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పనిచేయకపోగా, అవతలి పార్టీకి సహకరిస్తున్నారని చెప్పారు. ఇప్పటి నుంచి వాళ్లకు, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
- Advertisement -