Thursday, December 19, 2024

బిఆర్‌ఎస్ నుంచి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు వారిద్దరిపై ఈ వేటు పడింది. బిఆర్‌ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకే వారిపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. కొల్లాపూర్‌కు చెందిన జూపల్లి కృష్ణా రావుకు, స్థానిక ఎంఎల్‌ఎ బీరం హర్షవర్ధన్ రెడ్డికి మధ్య విభేవాలున్నాయి. కొల్లాపూర్‌లో జూపల్లి వర్గం అసమ్మతి కారణంగా పార్టీకి నష్ట కలుగుతోందని బిఆర్‌ఎస్ భావించింది.

ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొంత కాలంగా పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. ఆత్మీయ సమావేశాల పేరిట జిల్లాలోని తన వర్గం నేతలతో ఆయన భేటీ అవుతున్నారని సమాచారం. ఆయా సమావేశాల్లో కెసిఆర్ కుటుంబంపై ఆయన విమర్శలు చేశారని తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను బిఆర్‌ఎస్ సస్పెండ్ చేసింది.

Jupally Krishna Rao

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News