మహాత్మగాంధీ వర్ధంతి రోజునే రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం 420 రోజులు పూర్తి చేసుకుంటున్నా ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు పూర్తి చేయని నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా బీ ఆర్ ఎస్ నేతలు గాంధీ విగ్రహాలకు నివాళులర్పించడంతో పాటు వినతి పత్రాలు సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని తమ నిరసన తెలియచేస్తారని బిఆర్ఎస్ ప్రకటించింది. ఎన్నికల వాగ్దానాల ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టే నిరసన కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అన్ని స్థాయిల పార్టీ నాయకులు, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెల 30 నాటికి 420 రోజులైన సందర్భంగా ప్రజలకిచ్చిన 420 ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా మండల, నియోజక వర్గ, జిల్లా స్థాయిలో గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చి ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని ఆయన తెలిపారు.