Wednesday, January 22, 2025

ఎంఐఎం అభ్యర్ధికి మద్ధతు ప్రకటించిన బిఆర్‌ఎస్ పార్టీ

- Advertisement -
- Advertisement -

అసదుద్దీన్ ఓవైసీ అభ్యర్థనకు అంగీకరించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న మండలి ఎన్నికల్లో అధికార బిఆర్‌ఎస్ పార్టీ ఎంఐఎంకు మద్దతు ప్రకటించింది. మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ చేసిన అభ్యర్థన మేరకు సిఎం కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి బిఆర్‌ఎస్ వైదొలిగి ఎంఐఎంకు తోడుగా నిలువనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలో తమ పార్టీకి మద్దతు ప్రకటించినందుకు బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అందరినీ కలుపుకుపోయే దార్శనికత కలిగిన సిఎం కెసిఆర్ నాయకత్వాన్ని తెలంగాణ, దేశ ప్రజలు ఆశీర్వదిస్తారని అసద్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి-, మహబూబ్ నగర్ ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి ఎన్నికైన కాటేపల్లి జనార్ధన్ రెడ్డి పదవీ కాలం మార్చి 29వ తేదీన, హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జాఫ్రీ పదవీ కాలం మే ఒకటో తేదీన ముగియనుంది. ఈ స్థానాలకు మార్చి 13న ఎన్నికలు జరుగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News