Thursday, January 23, 2025

తెలంగాణలో బిఆర్‌ఎస్‌దే హవా

- Advertisement -
- Advertisement -
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గులాబీ పార్టీకి 9 నుంచి 11 లోక్‌సభ స్థానాలు
టైమ్స్ నౌ, నవ భారత్ సర్వే వెల్లడి
కేంద్రంలో మళ్లీ బిజెపిదే అధికారం

న్యూఢిల్లీ : రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే సిఎం కెసిఆర్ నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి హవా కొనసాగతుందని ‘టైమ్స్ నౌ నవ భారత్’ సర్వే తేల్చిచెప్పింది. బిఆర్‌ఎస్ 9 నుంచి 11 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. బిజెపికి సొంతంగా 285-325 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. కాంగ్రెస్ 111-149 స్థానాలకు పరిమితమవుతుందని తేల్చి చెప్పింది. ఇక మమత నాయకత్వంలోని టిఎంసి 20-22 స్థానాలు గెలుచుకుంటుందని, బిజెడి 12-14, వైఎస్సార్ సిపి 24 -25, ఆప్ 4- 7, సమాజ్‌వాదీ పార్టీ 48 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటాయని సర్వే పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News