Saturday, November 23, 2024

వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్- యూఎస్ ఏ కార్యకర్తల పాత్ర కీలకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి ముఖ్యమంత్రి కెసిఆర్ దూర దృష్టి, ఆలోచన, ప్రణాళికా నిబద్ధతకు నిదర్శనమని బిఆర్‌ఎస్ యూఎస్‌ఎ అడ్వైజరి బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ అన్నారు. బిఆర్‌ఎస్ యుఎస్‌ఎ ఆధ్వర్యంలో కొలంబస్ నగరంలో జాతీయ సదస్సు తన్నీరు మహేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో 50 రాష్ట్రాల నుండి బిఆర్‌ఎస్ యుఎస్‌ఎ ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బిఆర్‌ఎస్ ఏర్పడిన తర్వాత అమెరికాలో ఇది తొలి జాతీయ సదస్సు కావడం గమనార్హం. ఈ సదస్సుకు అతిధులుగా ప్రముఖ అటోర్నీ వినీత మెహ్రా, ఫెడరేషన్ అఫ్ ఇండియన్ అసోసియేషన్స్ అధ్యక్షులు అరిందమ్ గుహ, బ్లూ ఆష్ సిటీ కౌన్సిల్ వైస్ మేయర్ ప్రమోద్ ఝవేరి పాల్గొన్నారు. బిఆర్‌ఎస్ యుఎస్‌ఎ కన్వీనర్లు పూర్ణ బైరి, చందు తాళ్ల పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తన్నీరు మహేష్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో సంస్కరణలు, రైతు బంధు అమలు తీరు చూసి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని అన్నారు.

ఐటి రంగంలో 2.50 లక్షల కోట్ల ఎగుమతులు కెటిఆర్ సమర్థ నాయకత్వం వల్లే సాధ్యపడిందన్నారు. టి – హబ్ ప్రపంచంలో అతిపెద్ద ఇంక్యూబేటర్ అని, టి -వర్క్ ఆవిష్కర్తలకు, చిన్న , మధ్యస్థ సంస్థలకు దేశంలో అతిపెద్ద నమూనా, ప్రాథమిక రూప కల్పన కేంద్రం అని అన్నారు. డేటా సెంటర్ పాలసీ కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, టి.ఎస్ ఐపాస్ ద్వార పదిహేను రోజుల్లో కంపెనీలు స్వీయ ధ్రువీకరణ చేసుకో కలిగిన రాష్ట్రం తెలంగాణ అని, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు కెటిఆర్ నిరంతర శ్రమ, చొరవతో సాధ్యపడ్డాయని చెప్పారు.

వినీత మెహ్రా మాట్లాడుతూ తెలంగాణ ఐటి రంగంలో కాకుండా ఫార్మా ఎగుమతుల్లో కూడా దేశంలో అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సైబర్ సెక్యూరిటి , డేటా సెంటర్, ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విధానాలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారాయన్నారు. టిఎస్ ఐపాస్ వల్ల పరిశ్రమలు పారిశ్రామిక అనుమతులు పొందేందుకు సహాయపడిందని ’రైట్ టు క్లియరెన్స్’ ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. టి-హబ్ 249 స్టార్టప్‌లను వేగవంతం చేసిందని, 403 మిలియన్ డాలర్ల నిధులు సేకరించడంలో సహాయపడిందన్నారు. తన గ్లోబల్ అవుట్‌పోస్ట్‌ను ఉత్తర అమెరికాలో ఏర్పాటు చేయడానికి యుఎస్‌ఎ ఆధారిత రెడ్‌బెర్రీతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు.

తెలంగాణ లో ప్రస్తుతం ఉన్న 15.6 శాతం వృద్ధి రేటుతో 2028 నాటికి దేశంలో మూడవ వంతు అభివృద్ధి, ఫార్మా రంగంలో ఐదవ వంతు ఎగుమతులు వంద బిలియన్ల వ్యాపార ఉత్పత్తులు తెలంగాణ నుంచి ఉంటాయన్నారు. బిఆర్‌ఎస్ యుఎస్‌ఎ ను అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేయడం, సమావేశాలకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఎన్నారైలను ఆహ్వానించడం, వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధి, తెలంగాణ నమూనాకు సంబంధించిన వీడియోలను వివిధ భారతీయ ప్రాంతీయ భాషల్లోకి అనువదించడం లాంటి కార్యక్రమాల చేపట్టాలని, తెలంగాణ మోడల్ గురించి వివరించాలని తన్నీరు మహేష్ కార్యకర్తలకు సూచించారు , రాబోయే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ యుఎస్‌ఎ కార్యకర్తల పాత్ర కీలకమని అన్నారు. అనంతరం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి తన్నీరు మహేష్ ప్రవేశపెట్టిన తీర్మానాలను సభ్యులు ఆమోదించారు. జాతీయ సదస్సులో కెసిఆర్ కటౌట్, కార్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నరసింహ నాగులవంచ అతిథులకు 30 రకాల రుచికరమైన తెలంగాణ వంటకాలతో భోజన ఏర్పాట్లు చేసారు. బిఆర్‌ఎస్ యుఎస్‌ఎ కార్యదర్శులు నరసింహ నాగులవంచ, అరవింద్ తక్కళ్లపల్లి, నాయకులు రజినీకాంత్ కూసానం, వేణు పామేర, డేవిడ్ విక్రమ్ సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్థానిక సంఘాల నాయకులు రామకృష్ణ కాసర్ల, విష్ణు, సుధాకర్, శ్రీనివాస్ ఆకుల, శ్రీధర్ బిల్లకంటి, అశోక్ ఎల్లందుల, అమర్ రెడ్డి, సాజిత్ దేశినేని పాల్గొన్నారు.

కార్యక్రమంలో బిఆర్‌ఎస్ యుఎస్‌ఎ నాయకులు అడ్వైసర్ రవి ధన్నపునేని, బిందు చీదెళ్ల, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, డల్లాస్ నుండి శ్రీనివాస్ సురభి,మనోజ్ ఇనగంటి, శ్రీకాంత్ పీచర, దేవేందర్ చిక్కాల, గిరిధర్ వీరమనేని, శశి దొంతినేని, ఆస్టిన్ నుండి హరీష్ రెడ్డి వ్యాల్ల, శ్రీనివాస్ పొన్నాల న్యూ జెర్సీ నుండి మహేష్ పొగాకు, శ్రీనివాస్ జక్కిరెడ్డి. వాషింగ్టన్ డీసీ నుండి అనిల్ కాశినేని, కిషోర్. అట్లాంటా నుండి శ్రీధర్ జూలపల్లి, రంజిత్ కోదాటి ఫ్లోరిడా నుండి టోనీ జన్ను, కాలిఫోర్నియా నుండి రాజ్ భవాని, శివ కాలేరు, డెట్రాయిట్ నుండి అనిల్ దొంతినేని, వెంకట్ మంతెన డెలావేర్ నుండి భాస్కర్ పిన్న చికాగో నుండి మహిపాల్ రెడ్డి, ప్రశంష్ సియాటిల్ నుండి గణేష్ యూత్ కమిటీ నాయకులు అభిషేక్ కొత్తూర్, ఉదయ్ యాదవ్, కిషోర్, శరన్ దొంతినేని, కార్తీక్ రంగినేని, సంతోష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News