Monday, December 23, 2024

అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలుపు ఖాయం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బిఆర్‌ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని దేవరకొండ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చందంపేట మండలం పాతతెల్‌దేవరపల్లి గ్రామానికి చెందిన 100మంది ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబి కండువాలుకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. సీఎం కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దిక్కులేని పార్టీగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2014 సంవత్సరానికి ముందు ఆకలిచావులు ఉండేవని, నేడు కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు మూడు పూటలు కడుపు నింపుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు. పార్టీలో చేరిన వారు పార్టీ బలోపేతానికి కృషిచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు ముత్యాల సర్వయ్య, యువజన విభాగం మండల అధ్యక్షులు సయ్యద్ రమావత్ మోహన్‌కృష్ణ, బొడ్డు గోపాల్‌గౌడ్,అర్జున్‌సింగ్, మద్దిమడుగు రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News