Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ గెలుపు ఖాయం : ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ఎక్కడా లేదని, మూడోసారి కెసిఆర్ సిఎం కావడం ఖాయం అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగిన జగిత్యాల కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాబోయే రోజుల్లో కాబోయే ఎంఎల్‌ఎ సంజయ్ అన్న నినాదాల స్ఫూర్తితో పని చేయాలని కార్యకర్తలను కవిత కోరారు. గత ఎన్నికల్లో జగిత్యాల అడ్డపై బిఆర్‌ఎస్ జెండా ఎగరడం చాలా సంతోషం అనిపించింది అని తెలిపారు.

కరోనా సమయంలో విశేషంగా సేవలందించిన ఎంఎల్‌ఎ సంజయ్‌ని ఆమె అభినందించారు. ఎంఎల్‌ఎ సంజయ్ కుమార్ తప్పకుండా మరోసారి అద్భుతమైన మెజార్టీతో గెలుస్తారని కవిత ఆకాంక్షించారు. ఎంఎల్‌సి రమణ సమన్వయంతో మనం అద్భుతమైన మెజార్టీతో గెలవబోతున్నామని కవిత తెలిపారు. పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ల గురించి ఆలోచించొద్దు అని స్పష్టం చేశారు. బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో కేవలం కాంగ్రెస్‌తోనే తమ పార్టీకి పోటీ అని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గానికి జీవన్ రెడ్డి చేసింది ఏమీ లేదని కవిత విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News