Saturday, December 21, 2024

క్షేత్రంలో కాంగ్రెస్ ఎక్కడ?

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: ప్రస్తుతం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చేస్తున్న హడావిడి చూస్తుంటే ఆ పార్టీ గాలిలో మేడలు కడుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరికి వారు తమకు తోచినట్లు సర్వేలు చేసుకొని ఫలానా వారు గెలుస్తారని, ఫలానా వ్యక్తి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని.. మరో చోట బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉత్కంఠగా ఉందంటూ మౌత్ ప్రచారంతో కాంగ్రెస్ శునకానందం పొందుతోందని భావిస్తున్నారు. వాస్తవితకు దూరంగా కాంగ్రెస్ చేస్తున్న హడావిడి చూస్తుంటే చాలా మంది ఓటర్ల ముక్కున వేలేసుకుంటున్నారు. ఆలి లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికలు ఇంకా జరగక ముందే ఇప్పేడే వారు ఎమ్మెల్యేలుగా గెలిచినట్లు ఫీల్ అవుతున్నారు. దీంతో ప్రజలు విస్తుపోతున్నా రు. ఇప్పుడే వీరి ప్రవర్తన ఇలా ఉంటే నిజంగా గెలిచిన తర్వాత పరిస్ధితులు ఎలా ఉంటాయోనని చర్చించుకుంటున్నారు. కత్తి విడిచి సాము చేసినట్లు వాస్తవికతను మరిచి గెలుపుపై ఆశల పల్లికిలో ఊరేగుతున్నారు.

కేవలం సోషల్ మిడి యా వేదికగా కొందరికి కండువాలు కప్పి కాంగ్రెస్ గాలి వీస్తుందంటూ గాలిలో మేడలు కట్టుకుంటున్నారన్న చర్చ సాగుతోంది. అసలు గ్రౌండ్ లెవల్లో ప్రజలు ఎవరివైపు ఉన్నారన్న విషయాలను పక్కకు పెట్టి కేవలం వాట్సాప్‌లు, ఫేస్ బుక్కులుతో ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల అనుభవం లేని కాంగ్రెస్ అభ్యర్థులు తికమక పడుతున్నారు. వారికి ఎన్నికల మేనేజ్‌మెంట్ తెలియకపోవడంతో ఎలా ముందుకు సాగాలన్న అవగాహన కొరవడుతోంది. కేవలం గుడ్డి ఎద్దు పొలంలో మేసినట్లు ఎలా పడితే అలా ముందుకు వెళ్తున్నారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లక పోవడంతో బిఆర్‌ఎస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయి. బిఆర్‌ఎస్ పార్టీకి రాజకీయ శిక్షణతో పాటు రెండుసార్లు పోటీ చేసి గెలిచిన సందర్భం, అనుభవం ఉన్న సిట్టింగ్‌లకే టికెట్ దక్కడంతో వారు ఎన్నికలను సమర్థ్దవంతంగా నిర్వహించుకుంటున్నారు. పని విభజన చేసుకుంటూ ఎన్నికల క్షేత్రంలో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల మేనేజ్‌మెంట్‌ను చక్కగా వాడుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. బిఆర్‌ఎస్ అభ్యర్థుల దగ్గర ప్రతి ఊరు, ప్రతి కుటుంబం, ప్రతి ఓటర్‌పై అవగాహన ఉండడంతో సులుభంగా ప్రచారాన్ని సాగిస్తున్నా రు. కాంగ్రెస్ అభ్యర్థులకు ఎలాంటి అవగాహన లేక పోవడం మైనస్‌గా మారుతోంది.

గ్రౌండ్ లెవల్లో బిఆర్‌ఎస్ ప్రచారం
ఒకవైపు బిఆర్‌ఎస్ అభ్యర్థులు రోడ్‌షోలు, గ్రామాల్లో ప్రచార లు చేసుకుంటూనే గ్రౌండ్ లెవల్లో ప్రచారాన్ని ముమ్మురం చేసుకుంటున్నారు. పార్టీ క్యాడర్‌ను కాపడుకుంటూనే ప్రచా ర సాదనాలతో ఓట్లు అడుగుతున్నారు. పదేళ్ల కాలంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ది పనులతో పాటు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారిని స్వయంగా కలిసి చేసిన పనిని గురించి వివరించి ఓట్లు అడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో పదేళ్ల కాలంలో బిఆర్‌ఎస్ అందించిన సంక్షేమ పథకాలు రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్దిక సహాయాలు, ఆరో గ్యశ్రీ, డబుల్ బెడ్ రూం ఇళ్లు, బిసి బందు, దళిత బందు, ష్కాలర్‌షిప్‌లు, కింద సహాయాలతో పాటు వ్యక్తిగత సహాయాలు పొందిన వారు దాదాపు 60 వేల నుంచి 70 వేల మందికి పైగా ఉన్నా రు. వారి పూర్తి వివరాలు ఉండడంతో వారి నుంచి ఓట్లు రాబట్టే ప్రయత్నాలు బిఆర్‌ఎస్ చేపడుతోంది.

ఇవి పక్కా ఓట్లు తమకు వస్తాయని బిఆర్‌ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ కేవ లం ప్రభుత్వ వ్యతిరేక ఓటుపైనే ఆధారపడి ఉంది. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వంపై అంత వ్యతిరేకత లేకపోవడంతో కాంగ్రెస్ షోషల్ మీడియా ద్వారా తప్పుడు సంకేతాలతో తమ ప్రచారాలను చేపడుతోంది. ఇదే తమను గెలిపిస్తాయని నమ్ముతున్నారు. ప్రజలు మాత్రం ఎవరు చాల తెలివిగా సమాధానం ఇస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా బిఆర్‌ఎస్‌పై ఇదే గాసిప్స్ వచ్చాయి. అయితే ఆ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గతంలో కంటే అధిక మెజార్టి సాదించింది. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ విజయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అసలు ప్రజల మనస్సులో ఏముందన్నది ఈనెల 30 వరకు వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News