Monday, January 20, 2025

బిఆర్‌ఎస్ సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష

- Advertisement -
- Advertisement -
  • చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం

మొయినాబాద్: సిఎం కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే బిఆర్‌ఎస్‌ను అఖండ మెజార్టీతో గెలిపిస్తాయని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం అన్నారు. మండలంలోని కేతిరెడ్డిపల్లి, చాకలిగూడ, సజ్జన్‌పల్లి, కంచెమోనిగూడ, అప్పారెడ్డిగూడ గ్రామాల్లో పల్లె పల్లెకు కేఎస్.రత్నం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా ఇంటింటికి తిరిగి కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు.

ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని, మరోమారు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు బిఆర్‌ఎస్‌ను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి కంజర్ల భాస్కర్, మండల పార్టీ మాజీ అధ్యక్షులు హన్మంత్‌రెడ్డి, మోత్కుపల్లి సర్పంచ్ రత్నం, కొండల్‌రెడ్డి, చిరాగ్ మోహన్‌గౌడ్, మాధవరెడ్డి, కొత్త మాధవరెడ్డి, మహేందర్, నీలకంఠం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News